Asianet News TeluguAsianet News Telugu

ఇదెక్కడి ఛోద్యం.. మాల వేసేటప్పుడు వరుడు ముద్దు పెట్టుకున్నాడని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు...!!

అందరూ చూస్తుండగా స్టేజ్ మీద ముద్దు పెట్టాడని ఓ వధువు ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసింది. ఎంత చెప్పినా వినలేదు. చేసేదేం లేక వరుడి కుటుంబం వెనక్కితిరిగింది. 

groom kisses bride on stage, angry woman refuses to marry in uttar pradesh
Author
First Published Dec 1, 2022, 10:11 AM IST

పెళ్లి.. వధూవరుల జీవితాల్లో ఓ అందమైన ఘట్టం. ఓ మధురానుభూతి. ఇక ప్రేమించి, పెద్దల్ని ఎదురించి తమ ప్రేమను పెళ్లి దాకా తీసుకువచ్చేవారికైతే అదో అపురూపమైన, జీవితకాలపు ఉద్వేగభరిత క్షణాలు. పెళ్లికోసం యేళ్ల తరబడి వేచి చూసిన వారికి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లి కుదరని వారికి.. ఇష్టపడి పెళ్లి చేసుకునేవారికి.. ఇలా కారణం ఏదైనా.. పెళ్లి అంటే జీవితంలో ఒక్కసారే వచ్చే మధురక్షణాలు. అందుకే ఈ సమయంలో పట్టరాని సంతోషంలో ఒక్కోసారి వధూవరులు కన్నీళ్లు పెట్టుకుంటారు. భావోద్వేగానికి గురవుతారు.

అయితే, ఇక్కడ ఓ వరుడు కాస్త ఒక్కడుగు ముందు వేసి తన కాబోయే జీవితసహచరిని ముద్దు పెట్టుకున్నాడు. అంతే ఆమెకు కోపం వచ్చింది. ఎంత కోపం అంటే పెళ్లినే రద్దు చేసుకునేంత. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. నిజమే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో జరిగింది. పెళ్లి తంతులో భాగంగా వరుడు తనను ముద్దు పెట్టుకున్నాడని ఆ వధువు ఆగ్రహించి పెళ్లిని రద్దు చేసుకుంది. 

మైనర్ సవతి కూతురి మీద అత్యాచారం.. తండ్రికి 20 యేళ్ల జైలు శిక్ష..కోర్టు తీర్పుకు ఎదురు తిరిగిన బాధితురాలు...

పెళ్లిలో ఇలాంటి చిలిపి పనులు మామూలే.. కానీ ఆ వధువు ఆగ్రహించడం ఇప్పుడు వైరల్ అవుతోంది. యూపీలోని సంభాల్ లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద బదాయూలోని బిల్సీకి చెందిన యువకుడికి బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెంది యువతితో నవంబర్ 26న వివాహం జరిగింది. ఆ తరువాత 29వ తేదీనాడు.. వరుడు కుటుంబ సభ్యుతలో పాటు వధువు గ్రామానికి చేరుకున్నాడు.

పెళ్లి ఆచారాల్లో భాగంగా వధువు మెడలో పూలమాల వేయాలి.. ఈ సమయంలో మాల వేస్తూ భార్యే కనా అని ముద్దు పెట్టుకున్నాడు. అంతో కోపోద్రిక్తురాలైన ఆ యువతి విరుచుకుపడింది. పెళ్లి క్యాన్సిల్ అంటూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇరు కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవకు దారి తీసింది. విషయం పంచాయతీ వరకు వెళ్లింది. అయినా కూడా వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios