Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: 100 కి.మీ సైకిల్‌పై వెళ్లి పెళ్లి, భార్యతో తిరిగి ఇంటికి

సైకిల్ పై  వంద కి.మీ ప్రయాణం చేసి ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి చేసుకొన్నాడు వరుడు. అంతేకాదు వధువుతో కలిసి సైకిల్ పై ఇంటికి చేరుకొన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
 

Groom cycles 100km to get married in Indias Uttar Pradesh state
Author
Lucknow, First Published Apr 30, 2020, 5:17 PM IST


లక్నో: సైకిల్ పై  వంద కి.మీ ప్రయాణం చేసి ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి చేసుకొన్నాడు వరుడు. అంతేకాదు వధువుతో కలిసి సైకిల్ పై ఇంటికి చేరుకొన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్కు ప్రజాపతికి, రింకీకి పెళ్లిని నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు రెండు కుటుంబాల పెద్దలు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలోని మహోబా జిల్లాలోని హామీపూర్ గ్రామానికి చెందిన  కల్కు ప్రజాపతి ముందుగా నిర్ణయించిన ముహుర్తం సమమయానికే పెళ్లి చేసుకొన్నారు. 

తల్లిదండ్రులతో పాటు ఎవరూ కూడ రాలేదు. కానీ ఆయన ఒక్కడే సైకిల్ పై వధువు గ్రామం మహోబా జిల్లాలోని పునియా గ్రామానికి చేరుకొన్నారు. ప్రజాపతి గ్రామం నుండి ఈ గ్రామానికి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఈ నెల 27వ తేదీన ఉదయం సైకిల్ పై తన గ్రామం నుండి పునియాకు సాయంత్రానికి చేరుకొన్నాడు. తన వెంట ఎవరిని కూడ తీసుకెళ్లలేదని ప్రజాపతి చెప్పారు. 

also read:కరోనా రోగుల్లో పెరిగిన రికవరీ రేటు, అక్కడే సడలింపులు: కేంద్ర ఆరోగ్య శాఖ...

పునియా గ్రామానికి సమీపంలోని బాబా దునియాదాస్ ఆశ్రమంలో ఏప్రిల్ 28వ తేదీన కల్కు ప్రజాపతి, రింకీల వివాహం జరిగింది. పెళ్లి జరిగిన వెంటనే భార్యను తీసుకొని ప్రజాపతి సైకిల్ తన ఇంటికి వచ్చాడు.

తాను తన పెళ్లిని ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకొన్నానని చెప్పారు. కానీ ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని ఆయన చెప్పారు.సైకిల్ పై వంద కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయడం అలసిపోయినా కూడ తన భార్యను తీసుకురావడం సంతోషంగా ఉందని ప్రజాపతి తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios