Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగుల్లో పెరిగిన రికవరీ రేటు, అక్కడే సడలింపులు: కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనా ప్రభావం లేని చోట్ల ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. 
 

corona virus:National recovery rate now 25.19%, health ministry says
Author
New Delhi, First Published Apr 30, 2020, 4:50 PM IST

న్యూఢిల్లీ:కరోనా ప్రభావం లేని చోట్ల ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. 

 కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ గురువారం నాడు సాాయంత్రం మీడియాతో మాట్లాడారు.కరోనా కట్టడిలో కేంద్రంతో కలిసి నడవాలని రాష్ట్రాలను కోరుతున్నట్టుగా చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా ఎక్కువగా నమోదౌతున్నట్టుగా ఆయన చెప్పారు.

కరోనా నుండి కోలుకొనే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. 78 శాతం కరోనా మరణాల్లో ఇతర వ్యాధుల ప్రభావం కూడ ఉందని ఆయన వివరించారు. ఇప్పటివరకు 1074 మంది మృతి చెందారని ఆయన వివరించారు. లారీ డ్రైవర్లకు స్క్రీనింట్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలను కోరినట్టుగా ఆయన తెలిపారు. 

గత 24 గంటల్లో 1718 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33 ,050చేరుకొందని చెప్పారు. 24 గంటల్లో 630 మంది కోలుకొన్నారన్నారు. ఇప్పటివరకు 8324 మంది ఈ వైరస్ నుండి కోలుకొని ఇంటికి చేరుకొన్నారని ఆయన తెలిపారు. 

గత 11 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు కావడం 11 రోజులకు తగ్గిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా సోకిన రోగుల రికవరీ రేటు 25 శాతానికి పైగా ఉందని ఆయన వివరించారు.కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలను కోరుతున్నట్టుగా ఆయన చెప్పారు.

భౌతిక దూరం పాటించే విషయంలో ప్రజలకు అవగాహనకు వచ్చారని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది.కరోనా లేని రోగులకు చికిత్స చేయడానికి  ప్రయత్నాలు చేస్తున్న విషయాలు తమ దృష్టికి వచ్చినట్టుగా కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో సరిపోను టెస్టింగ్ కిస్ట్ లు, పీపీఈ కిట్స్ తో పాటు ఇతర పరికరాలు ఉన్న విషయం తమ బృందం గుర్తించిందని కేంద్రం తెలిపింది. కరోనా రోగులను ట్రాక్ చేయడంతో పాటు డిశ్చార్జ్ చేసే వరకు ఐటీ డ్యాష్ బోర్డు వినియోగిస్తున్నట్టుగా చెప్పారు.

also read:పేదలకు రూ. 65 వేల కోట్లు అవసరం: రాహుల్‌తో రఘురామ్ రాజన్...

60 ఏళ్లకు పై బడిన వారిలో 51.2 శాతం మరణాలు సంభవించినట్టుగా కేంద్రం తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలో కరోనా రోగులు రికవరీ రేటు బాగుందని ఆరోగ్య శాఖ తెలిపింది.

హైద్రాబాద్ లో పర్యటించిన కేంద్ర బృందం గుర్తించిన విషయాలను ఆయన మీడియాకు వివరించారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నట్టుగా చెప్పారు. అయితే కొన్ని నిర్మాణ ప్రాంతాల్లో కార్మికులు మాస్కులు లేకుండా పనిచేస్తున్న విషయాన్ని గుర్తించినట్టుగా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios