ఇంటికి వచ్చిన కొద్ది గంటలకే అతనికి ఏమనిపించిందో తెలియదు.. ప్రశాంతత కోసం కొద్దిసేపు గుడికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బైటికి బయలుదేరాడు. అయితే అతా వెళ్లిన వ్యక్తి ఎంత సేపయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆలస్యానికి కారణం ఏంటని ఫోన్ చేశారు. అప్పుడా వరుడు చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం చెప్పాడు..?
రాజస్థాన్ : జీవితంలో ప్రతీ ఒక్కరూ కోరుకునే marriage అతని జీవితంలోనూ ఎదురయ్యింది. భార్యతో కలిసి ఆనందంగా ఏడడుగులు నడిచాడు. ఎంతో సంతోషంగా ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. జీవితాంతం తోడుంటానని పెళ్లి నాటి ప్రమాణాలు కూడా చేశాడు. కొత్త జీవిత ప్రయాణానికి భార్యని పుట్టింటినుంచి అత్తారింటికి తీసుకువచ్చాడు. అంతలోనే అనుకోనివిధంగా కుటుంబసభ్యులకు షాక్ ఇచ్చాడు.
ఇంటికి వచ్చిన కొద్ది గంటలకే దినేష్ కి ఏమనిపించిందో తెలియదు.. ప్రశాంతత కోసం కొద్దిసేపు గుడికి వెళ్లొస్తానని ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పి బైటికి బయలుదేరాడు. అయితే అతా వెళ్లిన వ్యక్తి ఎంత సేపయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆలస్యానికి కారణం ఏంటని ఫోన్ చేశారు. అప్పుడా వరుడు చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం చెప్పాడు..?
Rajasthanలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాల్లోకి వెడితే... బిల్వా గ్రామానికి చెందిన 32 యేళ్ల Dinesh Kumawat కు విరాట్ నగర్ కు చెందిన యువతితో ఆదివారం వివాహం జరిగింది. పెళ్లి తరువాత సోమవారం ఉదయం 9 గంటలకు వరుడు, వధువు కలిసి తమ గ్రామానికి చేరుకున్నారు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న దినేష్ సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లాడు.
ప్రశాంతత కోసం తమ ఊర్లోని Fortressకు దగ్గరలో ఉన్న Templeకి వెళ్లొస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరాడు. ఎంతసేపయినా రాకపోవడంతో దినేష్ సోదరుడు.. దినేష్ కు ఫోన్ చేశాడు. అయితే, అతను చెప్పింది విని అందరూ షాక్ అయ్యారు. దినేష్ తాను భోపాల్ గఢ్ కోట గోడ ఎక్కి suicide చేసుకోబోతున్నట్లు.. తన సమస్యను ఎవరూ పరిస్కరించలేరని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పాడు.
Parliament: పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం.. 10 నిమిషాల్లోనే..
వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. అతన్ని కిందికి దించే ప్రయత్నం చేశారు. కానీ దినేష్ ఎంతకూ దిగలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంత శ్రమించినా అతడు వారి మాట కూడా వినలేదు. కిందకు దిగలేదు. ఆ తరువాత తన దగ్గరకి ఎవరైనా రావాలని ప్రయత్నిస్తే తాను కిందు దూకుతానని బెదిరించాడు.
చివరగా దినేష్ మామ, అతడి బావ అతడిని పై నుంచి కిందికి దించి కాపాడారు. పోలీసులు మాట్లాడుతూ దినేష్ రైల్వే ఉద్యోగి అని తెలిపారు. పెళ్లైన కొన్ని గంటలకే అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటని వారు ఆరా తీస్తున్నారు. కాగా ఈ మొత్తం ఘటనలో ఏం జరిగిదో తెలియక ఆ నవవధువు షాక్ కు గురయ్యింది.
పెళ్లైన కొద్ది గంటలకే వరుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె భవిస్యత్ మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు కారణం ఏంటీ? అంత పెద్ద సమస్య ఉంటే పెళ్లికి ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ అతనికి ఉన్న సమస్య ఏంటి? అనే అనుమానాలు చాాలామంది వ్యక్తపరుస్తున్నారు.
