Asianet News TeluguAsianet News Telugu

పీఎం శ్రీయోజ‌న‌తో ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను ఆధునీక‌రించ‌డానికి వందేండ్లు కావాలి: కేజ్రీవాల్ విమ‌ర్శలు

ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో సహా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన 14,500 పాఠశాలలను మోడల్ స్కూల్‌లుగా అభివృద్ధి చేయడానికి పీఎం-శ్రీ యోజనను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. అయితే, అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకేసారి ఆధునీకరించాల‌నీ,  రాష్ట్రాలను బోర్డులోకి తీసుకోవాల‌ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
 

Govt schools need 100 years to modernize with PM-SHRI Yojana: Kejriwal criticizes
Author
First Published Sep 6, 2022, 4:10 PM IST

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్: పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)  జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.  విడతల వారీగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే సారి ఆధునీకరించాలని ప్ర‌ధాని కోరారు. ప్ర‌ధాని తాజాగా ప్ర‌క‌టించిన పీఎం శ్రీ యోజ‌న ప‌థ‌కంలో దేశంలోని 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి 100 ఏళ్లు పడుతుందని విమర్శించారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. “వచ్చే ఐదేళ్లలో మొత్తం 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి రాష్ట్రాలతో కలిసి ప్రణాళికను సిద్ధం చేయాలని” ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో సహా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన 14,500 పాఠశాలలను మోడల్ స్కూల్‌లుగా అభివృద్ధి చేయడానికి పీఎం-శ్రీ యోజనను ప్రధాన మంత్రి సోమవారం ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ.. ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM-SHRI) కింద అభివృద్ధి చేయబడిన పాఠశాలలు కొత్త జాతీయ విద్యా విధానం పూర్తి స్ఫూర్తిని పొందుపరుస్తూ మోడల్ పాఠశాలలుగా మారుతాయని అన్నారు.

 

ఇక ట్విట్ట‌ర్ లో స్పందించిన కేజ్రీవాల్.. "ప్రతి భారతీయ బిడ్డకు నాణ్యమైన-ఉచిత విద్య 1947లోనే మా పూర్తి దృష్టిని ఆకర్షించింది. మేము 75 ఏళ్లు కోల్పోయాము. ఇప్పుడు, విడతల వారీగా కాకుండా, మేము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఈ ప‌థ‌కంలోకి తీసుకోవాలి. భారతదేశం అంతటా అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి పెట్టుబడి పెట్టండి. మేము దానిని ఐదేళ్లలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి" అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు-స్థానిక సంస్థలచే నిర్వహించబడుతున్న పాఠశాలల నుండి ఎంపిక చేయబడిన ప్రస్తుత పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకం అమలు చేయబడుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios