దేశంలో టమాట ధరలు మండిపోతున్నాయి. కొన్ని వారాలుగా టమాట ధర రూ. 100కు పైనే ఉంది. ఈ క్రమంలో టమాట ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రకటించింది.
దేశంలో టమాట ధరలు మండిపోతున్నాయి. కొన్ని వారాలుగా టమాట ధర రూ. 100కు పైనే ఉంది. కొన్నిచోట్ల రూ. 200 మార్కును కూడా చేరుకుంది. ఈ క్రమంలో టమాట ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి టమాటా కొనుగోలు చేసి.. టమాటా ధరలు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలను వినియోగదారుల వ్యవహారాల శాఖన కేంద్రం కోరింది. తాజా స్టాక్‌లతో శుక్రవారం నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులకు టమాటలు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.
దాదాపు ప్రతి రాష్ట్రంలో టమోటా ఉత్పత్తి చేయబడుతుండగా.. దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు దేశంలోని మొత్తం ఉత్పత్తిలో దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వారి మిగులు ఉత్పత్తి.. భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు నిరంతర సరఫరా కోసం ఉపయోగించబడుతుంది. ‘‘ప్రాంతాల్లో ఉత్పత్తి సీజన్‌లు కూడా విభిన్నంగా ఉంటాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గరిష్ట పంట కాలం ఉంటుంది. జూలై-ఆగస్టు, అక్టోబర్-నవంబర్ కాలాలు సాధారణంగా టమాట తక్కు ఉత్పత్తి అయ్యే నెలలు’’ అని ప్రకటన ప్రభుత్వ పేర్కొంది.
ఇక, ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమాట సరఫరాలు వస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ‘‘ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల్లోని మార్కెట్‌లకు సరఫరాలు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తుంది. ముఖ్యంగా సతారా, నారాయణంగావ్, నాసిక్ నుంచి వస్తున్నాయి. ఇది ఈ నెలాఖరు వరకు ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె (చిత్తూరు)కి కూడా సహేతుకమైన పరిమాణంలో సరఫరా కొనసాగుతుంది. ఢిల్లీ, సమీప నగరాలకు హిమాచల్ ప్రదేశ్ , కర్ణాటక నుండి స్టాక్స్ అందుతున్నాయి. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంటలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ధరలు సమీప భవిష్యత్తులో తగ్గుతాయని అంచనా వేయబడింది’’ అని ప్రభుత్వం తెలిపింది.
ఇక, దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటం, ప్రతికూల వాతావరణంతో పంట దిగుబడి తగ్గడం, సరుకు రవాణాలో అంతరాయం కారణంగా టమాట ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
