ఇండియాలో పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మోసాలు: 100 వెబ్ సైట్లు బ్లాక్

పెట్టుబడులతో పాటు  పార్ట్ టైమ్ జాబ్ ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వంద వెబ్ సైట్లను కేంద్రం బుధవారం నాడు బ్లాక్ చేసింది.  

Govt blocks 100 websites duping people via task-based job offers lns


న్యూఢిల్లీ: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న  100 వెబ్ సైట్లను  కేంద్ర హోంమంత్రిత్వశాఖ  బుధవారంనాడు బ్లాక్ చేసింది.  పెట్టుబడులు లేదా టాస్క్ ఆధారిత ఆర్ధిక నేరాలకు ఈ వెబ్ సైట్లు పాల్పడుతున్నాయి. మరో వైపు  పార్ట్ టైం జాబ్ ల పేరుతో  మోసాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలిసిస్ యూనిట్ సిఫార్సు మేరకు  ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వెబల్ సైట్లను బ్లాక్ చేసింది.

ఎన్‌సీటీఎయూ  గత వారంలో వ్యవస్థీకృత పెట్టుబడి, టాస్క్ బేస్డ్, లేదా పార్ట్ టైమ్ జాబ్ ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 100 వెబ్ సైట్లను గుర్తించింది.  సమాచార చట్టం  2000 కింద  ఈ వెబ్ సైట్లను బ్లాక్ చేసినట్టుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వెబ్ సైట్లు అక్రమ పెట్టుబడి సంబంధిత ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది.

కార్డ్ నెట్ వర్క్,  క్రిఫ్టో కరెన్సీ, అంతర్జాతీయ ఫిన్ టెక్ కంపెనీలను ఉపయోగించి పెద్ద ఎత్తున ఆర్ధిక మోసాలకు  ఈ వెబ్ సైట్లు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.  భారత్ నుండి వచ్చిన ఆదాయాన్ని లాండరింగ్ చేసినట్టుగా  హోంశాఖ తెలిపింది.

ఈ ఆర్ధిక నేరాలకు సంబంధించి  1930 హెల్ప్ లైన్ తో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా అనేక ఫిర్యాదులు అందినట్టుగా  కేంద్రం తెలిపింది.ఈ రకమైన నేరాలతో  భారతీయులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది.  అంతేకాదు భారతీయుల డేగా కూడ  విదేశాలకు వెళ్తుందని హోంశాఖ అనుమానిస్తుంది.

వర్క్ ఫ్రమ్ హోం పేరుతో  ఆకర్షించి  మోసాలకు పాల్పడుతున్నారని  కేంద్ర హోం శాఖ తెలిపింది. నిరుద్యోగులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని మోసాలు చేస్తున్నారు.

also read:ఆర్ధిక మోసాలు:100కి పైగా చైనా వెబ్ సైట్లపై బ్యాన్‌ కోసం చర్యలు

ఒక్కసారి  ఈ ప్రకటనపై క్లిక్ చేస్తే  వాట్సాప్, టెలిగ్రామ్ లేదా  ఇతర  సోషల్ మీడియాలో  ఈ వెబ్ సైట్ నుండి  ఏజంట్లు  మాట్లాడుతారు. చిన్న టాస్క్ లను  చేస్తే  రోజుకు వేలాది రూపాయాలు సంపాదించే అవకాశం ఉంటుందని  చెబుతారు.  ఇలా ఆకర్షించి  మోసాలకు పాల్పడుతున్నారు. తొలుత కమీషన్ రూపంలో నగదును అందిస్తారు. ఆ తర్వాత మాత్రం  డబ్బులు చెల్లించరు. అయితే  పెట్టుబడి పెడితే  ఇంకా పెద్ద ఎత్తున కమీషన్ వస్తుందని ఆశ చూపుతారు.  ఇలా పెట్టుబడి పెట్టిన వారంతా మోసపోతున్నారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios