భక్తి గీత సమ్మోహనమే.. కలకత్తా కె శ్రీ విద్య "గోవింద నందనందన" వీడియో పాట విడుదల..
Govinda Nandanandana: రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, కలకత్తా కె శ్రీ విద్య, తన సోదరుడు,సంగీత స్వరకర్త, గాయకుడు మోహన్ కన్నన్ (అగ్నీ)తో కలిసి "గోవింద నందనందన"అనే వీడియో పాటను రూపొందించారు. తాళ్లపాక అన్నమాచార్య సాహిత్యం ఆధారంగా ఈ వీడియో గీతాన్ని చిత్రీకరించారు.
Govinda Nandanandana: రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, కలకత్తా కె.శ్రీ విద్య, తన సోదరుడు,సంగీత స్వరకర్త, గాయకుడు మోహన్ కన్నన్ (అగ్నీ)తో కలిసి "గోవింద నందనందన" అనే వీడియో పాటను రూపొందించారు. తాళ్లపాక అన్నమాచార్య సాహిత్యం ద్వారా ఈ వీడియో గీతాన్ని స్వరపరించారు. ఈ పాటను కోల్ కత్తాలోని శ్రీ గురువాయూరప్పన్ ఆలయంలో చిత్రీకరించారు. ఈ మ్యూజిక్ వీడియో లో సహజమైన శ్రీ గురువాయూరప్పన్ ఆలయాన్ని చాలా రమణీయంగా చూపించారు. సంగీత స్వరకర్త, గాయకురాలు శ్రీవిద్య తన గాత్రంలో ఈ గోవింద నందనందన భజనకు జీవం పోసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కలకత్తా కె శ్రీవిద్యగా పిలువబడే శ్రీవిద్య ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న కర్ణాటక సంగీత విద్వాంసురాలు, ఆమె గాత్రంతో పాటు.. అటు వయోలిన్ వాయిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సంగీత విద్వాంసురాలు తన తల్లి శ్రీమతి వసంత కన్నన్ వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు. వసంత కన్నన్ కూడా ప్రపంచ ప్రఖ్యాత కర్నాటక వయోలిన్ విద్వాంసురాలు .
ఈ సందర్భంగా శ్రీవిద్య మాట్లాడుతూ.." ఈ భజన చాలా సరదాగా ఉంటుంది. అలాగే..ఇది చాలా ప్రత్యేకమైనది. గోవింద నందనందన భజన.. కేవలం పాటలు పాడటమే కాదు. అందులో ప్రతి పాటను ప్రత్యేకంగా సర్వకల్పన చేసి..పాడి,షూటింగ్ చేశాం.ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నాకు సహాయపడినా, నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
దాదాపు 7 సంవత్సరాల వయస్సు నుండి మోహన్ ,శ్రీవిద్య భారతదేశం అంతటా అనేక కర్నాటిక్ క్లాసికల్ కచేరీ చేశారు. శ్రీ విద్య పాటలు పాడటం,వయోలిన్ వాయించడంలో మేటీ. అలాగే.. మోహన్.. మృదంగం వాయించడంతో ప్రవీణ్యం ఉంది. 2011లో జాతీయ అవార్డు గెలుచుకున్న మరాఠీ చిత్రం శాల" కోసం సదా అనే పాటను కంపోజ్ చేసి పాడారు. సదా 2012లో వీడియో మ్యూజిక్ అవార్డును కూడా గెలుచుకుంది. వారు తమ తల్లి వసంత కణ్ణన్ కద్యుత్ గంటి రాగంలో స్వరపరిచిన థిల్లానాకు వీరు కూడా సహకరించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=3EJw7LHazW8