జైపూర్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు 21 రోజుల ముందు నోటీసుకు అంగీకరిస్తే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తనకుల ఎలాంటి అభ్యంతరం లేదని రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ కోరారు. ఈ విషయమై లేఖలు రాశాడు. మరో వైపు ఈ విషయమై ఇవాళ ప్రధాని మోడీతో కూడ గెహ్లాట్ మాట్లాడారు.

అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సి వస్తే ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేలు భౌతిక దూరం పాటించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. భౌతిక దూరం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకొంటారని గవర్నర్ ప్రశ్నించారు.

also read:ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు గెహ్లాట్: అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్

కరోనా సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి వస్తే  తక్కువ సమయం సరికాదని  గవర్నర్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు 21 రోజుల ముందు నోటీసు అంగీకరించాలని ఆయన కోరారు.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో గెహ్లాట్ రాసిన లేఖపై గవర్నర్ స్పందించారు.  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రెండు సార్లు కేబినెట్ పంపిన సిఫారసులను తిప్పి పంపిన విషయం తెలిసిందే.