Asianet News TeluguAsianet News Telugu

గర్ల్ ఫ్రెండ్ కోసం దొంగగా మారిన గూగుల్ ఉద్యోగి

నిందితుడు క్యాబ్‌లో వచ్చినట్టు హోటల్‌ బయట ఏర్పాటైన కెమెరాల్లో రికార్డైంది.  క్యాబ్‌ రిజిస్ర్టేషన్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ల ద్వారా క్యాబ్‌ను ఎవరు బుక్‌ చేశారనేది పోలీసులు ఆరా తీశారు.

Google Techie Arrested for Theft at Luxury Delhi Hotel, Says Did it to Meet Girlfriend's Expenses
Author
Hyderabad, First Published Oct 11, 2018, 12:30 PM IST

గర్ల్‌ఫ్రెండ్‌ ఖర్చుల కోసం ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి  దొంగగా మారాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే.. గర్విత్ షానీ అనే 24 ఏళ్ల ఇంజినీరు ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ గూగుల్‌లో పనిచేస్తున్నాడు.

 హర్యానాలోని అంబాలా జిల్లాకు చెందిన గర్విత్ షానీ  గత నెల 11న ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌లో ఐబీఎం నిర్వహించిన ఓ సెమినార్‌లో పాల్గొన్నాడు. ఈ సమావేశానికి హాజరైన దేవయాని జైన్‌ అనే మహిళ  తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ10,000లు గల్లంతయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్‌ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, ఆహ్వానితుల జాబితా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు క్యాబ్‌లో వచ్చినట్టు హోటల్‌ బయట ఏర్పాటైన కెమెరాల్లో రికార్డైంది.  క్యాబ్‌ రిజిస్ర్టేషన్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ల ద్వారా క్యాబ్‌ను ఎవరు బుక్‌ చేశారనేది పోలీసులు ఆరా తీశారు.

నిందితుడు ఫోన్‌ స్విచాఫ్‌ చేయగా, కొత్త మొబైల్‌ నెంబర్‌ను గుర్తించిన పోలీసులు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో గర్ల్‌ఫ్రెండ్‌ ఖర్చులు భరించేందుకే తాను దొంగతనానికి పాల్పడ్డానని పోలీసుల విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. చోరీ సొమ్ములో రూ 3000ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios