Goods Train Derails: నార్సింగ్‌పూర్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
Narsinghpur: మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నర్సింగ్ పూర్ జిల్లాలో శనివారం రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాహుల్ శ్రీవాస్తవ తెలిపారు.

Goods Train Derails In Madhya Pradesh: మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నర్సింగ్ పూర్ జిల్లాలో శనివారం రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాహుల్ శ్రీవాస్తవ తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్లోని నర్సింగ్ పూర్- కరేలి స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సింగ్ పూర్ జిల్లాలో శనివారం రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాహుల్ శ్రీవాస్తవ తెలిపారు. పట్టాలు తప్పడంతో జబల్ పూర్-ఇటార్సీ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు పూర్తిగా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన తర్వాత డౌన్ లైన్ (ఇటార్సీ నుంచి జబల్ పూర్ వరకు) నుంచి రైళ్లను దారి మళ్లించామనీ, ప్రస్తుతం అప్ లైన్ లో ట్రాఫిక్ ను పూర్తిగా పునరుద్ధరించామని సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఇటార్సీ ఒకటని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
గతవారంలో జైపూర్ లో కూడా గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జులై 15న జైపూర్ సమీపంలో గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో కనీసం ఏడు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. జైపూర్-మదర్ రైల్వే సెక్షన్‌లోని అసల్‌పూర్ జాబ్‌నర్ మరియు హిర్నోడా స్టేషన్‌ల మధ్య ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు.