Asianet News TeluguAsianet News Telugu

హర్యానాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. బోల్తా పడిన 8 వ్యాగన్లు

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌ ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో 8 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ రైలు ప్రమాదం వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

Goods train derailed in Haryana.. 8 wagons overturned
Author
First Published Jan 16, 2023, 4:04 PM IST

హైదరాబాద్ లోని రోహ్‌తక్‌ జింద్ రైల్వే లైన్‌లోని సమర్‌గోపాల్‌పూర్ గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఎనిమిది బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం వల్ల అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి పంజాబ్ వెళ్లే సర్బత్ ద భలా రైలు షకుర్బస్తీలో ఆగాల్సి వచ్చింది. అలాగే బటిండా ఎక్స్‌ప్రెస్ పాత ఢిల్లీ నుంచి రోహ్‌తక్‌కు వెళ్లలేకపోయింది.

హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం రాజు ముకర్రం జా కన్నుమూత.. రేపు హైదరాబాద్ కు మృతదేహం

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌ క్లియర్ చేశారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ఏడు గంటలకు రోహ్‌తక్ నుండి జింద్‌కు వెళ్లే గూడ్స్ రైలు సమర్‌గోపాల్‌పూర్ గ్రామ సమీపంలో (కిలోమీటరు నంబర్ 75/11-15) ప్రయాణిస్తోంది. అయితే అకస్మాత్తుగా మధ్యలో ఎనిమిది వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

‘‘రోహ్ తక్ జిల్లాలో ఉదయం 6:45 గంటలకు గూడ్స్ రైలుకు చెందిన 8 వ్యాగన్లు ట్రాక్ నుండి పట్టాలు తప్పాయి. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మేము ప్రయత్నాలు ప్రారంభించాం. రైలు ఢిల్లీ నుండి రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌కు వెళుతోంది. మేము వ్యాగన్లను తొలగించే పనిని మొదలుపెట్టాం.  అని నార్త్ రైల్వే డి గార్గ్ డీఆర్ఎం వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కి తెలిపారు.

రైలు పట్టాలు తప్పిన వెంటనే లోకో పైలెట్ రోహ్‌తక్‌లోని రైల్వే కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందించాడు. దీంతో ఆ పట్టాల నుంచి వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైళ్లు ఆలస్యమవడంతో పంజాబ్, ఢిల్లీ వెళ్లే రైళ్ల కోసం రోహ్‌తక్ రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సర్బాద్-దా-భల్లా ఎక్స్‌ప్రెస్, బటిండా ఎక్స్‌ప్రెస్, రోహ్‌తక్-జింద్ ప్యాసింజర్ రైలు, న్యూఢిల్లీ- జింద్ మెమో రైలుతో పాటు అనేక రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

కుక్కకు భయపడి ప్రాణ రక్షణ కోసం మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్ మృతి.. హైదరాబాద్‌లో ఘటన

గత శుక్రవారం సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లా మజోమా ప్రాంతంలో బారాముల్లా-బనిహాల్ సెక్షన్‌లోని ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అలాగే ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి మాగం తహసీల్దార్ జాఫర్ అహ్మద్ లోన్ చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైలు బనిహాల్ నుండి వస్తుండగా ట్రాక్‌పై నుండి జారిపడిందని చెప్పారు. స్టేషన్‌కు సమీపంలో ఉండటంతో రైలు వేగం తక్కువగా ఉందని, అందుకే ఎవరికీ గాయాలు కాలేదని ఆయన చెప్పారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని, వారు తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని లోన్ తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios