కేంద్ర సాయుధ దళాల నుంచి 54,953 కానిస్టేబుల్‌, రైఫిల్‌మన్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. 

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలియజేసింది. కేవలం పదోతరగతి క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది. కేంద్ర సాయుధ దళాల నుంచి 54,953 కానిస్టేబుల్‌, రైఫిల్‌మన్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 23 ఏళ్లలోపు వారు వీటికి పోటీపడవచ్చు. ప్రతి విభాగంలోనూ మహిళల కోసం కొన్ని పోస్టులను కేటాయించారు. ఆగస్టు 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ విభాగంలో 16,984 ఉద్యోగాలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంలో 200 ఉద్యోగాలు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విభాగంలో 21,566 ఉద్యోగాలు, సశస్త్ర సీమబల్ విభాగంలో 8,546 ఉద్యోగాలు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగంలో 4,126 ఉద్యోగాలు, అస్సాం రైణిలంప్ విభాగంలో 3,076 ఉద్యోగాలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విభాగంలో 08 ఉద్యోగాలు, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంలో 447 ఉద్యోగాలను కేటాయించారు.