పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం నిర్ణయించింది. దీని కోసం త్వరలో విధి విధానాలు ఖరారు చేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రంలోని ప్రైవేట్ రంగంలో దాదాపు 11,000 మంది యువతకు నియామక పత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రైవేట్ రంగంలో కొత్త విధానానికి సంబంధించిన నిబంధనలకు మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపిందని సీఎం సోరెన్ తెలిపారు. కొత్త పాలసీ ప్రకారం స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు ప్రైవేట్ సంస్థలు కల్పించాల్సి ఉంటుందన్నారు. నియామక పత్రాలు అందుకున్న యువతను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. జేపీఎస్సీ, యూపీఎస్సీ, ఇంజినీరింగ్, మెడికల్, ప్రభుత్వ ఉద్యోగాల వంటి ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి అతి త్వరలో ఓ విధానాన్ని తీసుకురాబోతున్నామని అన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మరో ట్విస్ట్.. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ !
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. JPSC పరీక్షల్లో ఉత్తీర్ణులైన 250 మందికి పైగా తాము ఇటీవల అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చామని చెప్పారు. JPSC పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం వ్యక్తులలో 35 మంది వ్యక్తులు దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్నారని, ఇది అతి పెద్ద విజయమని చెప్పారు. తొలిసారిగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వ్యవసాయ అధికారులు, ఉద్యోగులను కూడా నియమించామని సోరెన్ తెలిపారు. జార్ఖండ్‌ను వెనుకబడిన రాష్ట్రం అంటారని, కానీ వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. దీని కోసం అందరి సహకారం అవసరమని అన్నారు.
ఆలయంలోకి ఆవు మాంసం విసిరిన అల్లరి మూకలు.. దుకాణాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
జార్ఖండ్ కార్మిక మంత్రి సత్యానంద్ భోక్తా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం, రాజ్యసభ ఎంపీ మహువా మాంఝీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మిక, ఉపాధి, శిక్షణ, నైపుణ్యాల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ టోప్పో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందిన 11,391 మంది యువకులకు నియామక పత్రాలు అందజేశామన్నారు. దుస్తుల రంగంలో మొత్తం 5,332 మంది, ఆరోగ్య సంరక్షణలో 1,041 మంది, మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో 1,168 మంది, ఆటోమోటివ్ రంగంలో 785 మంది, టెలికాం రంగంలో 118 మంది యువతకు ఉపాధి లభించిందని టోప్పో తెలిపింది.
