యాత్రికులకు గుడ్ న్యూస్ : సెప్టెంబర్ నుండి నేరుగా భారత్ లోంచే కైలాస పర్వతానికి...
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పితోర్‌గఢ్ జిల్లాలోని నాభిధాంగ్‌లోని కేఎంవిఎన్ హట్స్ నుండి భారత్-చైనా సరిహద్దులోని లిపులేఖ్ పాస్ వరకు నిర్మిస్తున్న రహదారి పని సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
పితోర్‌గఢ్ : ఈ ఏడాది సెప్టెంబర్ నుండి, భారత భూభాగం నుండి శివుడు కొలివై ఉన్న ప్రాంతంగా భావించే కైలాస పర్వతాన్ని భక్తులు సందర్శించుకోగలుగుతారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) పితోర్‌గఢ్ జిల్లాలోని నాభిధాంగ్‌లోని కెఎంవిఎన్ హట్స్ నుండి భారతదేశం-చైనా సరిహద్దులోని లిపులేఖ్ పాస్ వరకు రహదారిని వేసే పనిని ప్రారంభించిందని, ఇది సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
మెనూ ప్రకారం భోజనం తయారు చేయడం లేదని ఫిర్యాదు.. ప్రిన్సిపాల్, సూడెంట్లకు మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
బీఆర్ఓ డైమండ్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ విమల్ గోస్వామి మాట్లాడుతూ, "మేము కెఎంవిఎన్ హట్స్ నుండి నాభిధాంగ్‌లోని లిపులేఖ్ పాస్ వరకు సుమారు ఆరున్నర కిలోమీటర్ల పొడవున రహదారిని నిర్మించే పనిని ప్రారంభించాం" రోడ్డు పూర్తయిన తర్వాత.. ఈ దారిపొడవునా 'కైలాష్ వ్యూ పాయింట్' సిద్ధంగా ఉంటుంది.
భారత ప్రభుత్వం 'కైలాష్ వ్యూ పాయింట్'ను అభివృద్ధి చేసే బాధ్యతను హిరాక్ ప్రాజెక్ట్‌కి అప్పగించింది. రోడ్లు నిర్మించే పనులు చాలావరకు జరిగాయని, వాతావరణం అనుకూలిస్తే సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని గోస్వామి చెప్పారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన లిపులేఖ్ పాస్ ద్వారా కైలాష్-మానససరోవర్ యాత్ర ఆ తరువాత తిరిగి ప్రారంభం కాలేదు. కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించడంలో భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి.