Asianet News TeluguAsianet News Telugu

చెన్నై ఎయిర్‌పోర్టులో రూ. 41 లక్షల బంగారం సీజ్: ప్రయాణీకుడు అరెస్ట్

చెన్నై ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి  కస్టమ్స్ అధికారులు   రూ. 41 లక్షల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. 

gold worth Rs. 41 lakh seized at Chennai air port lns
Author
Chennai, First Published Jul 21, 2021, 10:08 AM IST

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎయిర్ పోర్టులో  ఓ ప్రయాణీకుడి నుండి రూ. 41 లక్షల విలువైన బంగారాన్ని  కస్టమ్స్ అధికారులు మంగళవారం నాడు సీజ్ చేశారు.దుబాయ్ నుండి చెన్నైకు వచ్చిన ప్రయాణీకుండి లగేజీని తనిఖీ చేసిన  కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నారు. ఆయన లగేజీలో రూ. 41 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు అధికారులు. 

ఈ బంగారాన్ని  ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై  కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.దేశంలోని పలు ఎయిర్ పోర్టుల్లో కూడ ఇదే తరహలోనే  పెద్ద ఎత్తున  బంగారాన్ని ఇటీవల కాలంలో  కస్టమ్స్ అధికారులు సీజ్ చేస్తున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఎయిర్ పోర్టుల్లో బంగారం తరలిస్తూ ప్రయాణీకులు పట్టబడుతున్నారు.దుబాయ్  సహా విదేశాల నుండి అక్రమ మార్గంలో ఇండియాకు బంగారాన్ని తరలిస్తూ పలువురు దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో పట్టుబడుతున్నారు. ఈ బంగారం స్మగ్లింగ్ కు నిందితులు  కొత్త తరహా పద్దతులను వాడుతున్నారని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios