Asianet News TeluguAsianet News Telugu

కేరళ గోల్డ్ స్కాం: హైకోర్టులో స్వప్న సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

: కేరళ గోల్డ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Gold smuggling case accused Swapna Suresh files anticipatory bail plea
Author
Thiruvananthapuram, First Published Jul 9, 2020, 11:14 AM IST

తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

బుధవారం నాడు రాత్రి కేరళ హైకోర్టులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా కోర్టు వర్గాలు తెలిపాయి.

also read:గోల్డ్ స్మగ్లింగ్, చిక్కుల్లో సీఎం: అధికారికి ఉద్వాసన, అసలేమైంది?

ఈ పిటిషన్‌పై ఎప్పుడు విచారణ చేయనున్నారో గురువారం నాడు హైకోర్టు తేల్చనుంది. ఆన్ లైన్ లో ఏ సమయంలోనైనా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. 

మధ్యాహ్నానికి ముందే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే మరునాడు ఆ బెయిల్ పిటిషన్ ను విచారించనున్నారు. యూఏఈ నుండి తిరువనంతపురానికి ఈ నెల 5వ తేదీన 30 కిలోల బంగారం వచ్చింది. ఈ విషయంలో కేరళ సీఎం విజయన్ పై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఈ విషయం వెలుగు చూసినప్పటి నుండి స్వప్న సురేష్ కన్పించకుండా పోయారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై యూడీఎప్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ విషయమై వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ విషయమై విచారణ జరపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు కోరారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios