Asianet News TeluguAsianet News Telugu

ఎస్ఐని చంపిన మేకల దొంగలు.. 24 గంటల్లో నిందితులు అదుపులోకి..

తమిళనాడులో రాత్రిపూట మేకలు దొంగతనం చేస్తున్న కొందరు నిందితులు వారిని పట్టుకోవడానికి వచ్చిన ఎస్ఎస్ఐని హతమర్చారు. టూ వీలర్‌పై మేకలను దొంగతనం చేసి పట్టుకెళ్లుతుండగా రాత్రి గస్తీ కాస్తున్న ఎస్ఎస్ఐ భూమినాథన్ చూశారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారు తప్పించుకుని బైక్ వేగం పెంచారు. దీంతో ఎస్ఎస్ఐ కూడా టూ వీలర్‌పై కొన్ని కిలోమీటర్లు వారిని వెంబడించి పట్టుకున్నారు. కానీ, ఆయన నుంచి తప్పించుకోవడానికి ఓ నిందితుడు కత్తితో వేటు వేశాడు. వారంతా స్పాట్ నుంచి పరారయ్యారు. ఈ కేసులోని నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు.

goat thieves killed SSI in tamilnadu now in custody
Author
Chennai, First Published Nov 22, 2021, 1:42 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చెన్నై: Tamil Nadu రాత్రిపూట మేకలు(Goats) దొంగలించే ఓ ముఠా ఎస్ఎస్ఐ(SSI)ని హతమార్చింది. రాత్రిపూట గస్తీ కాస్తుండగా టూ వీలర్‌పై మేకలను దొంగిలించి తీసుకెళ్తున్న కొందరిని ఎస్ఎస్ఐ భూమినాథన్ చూశారు. వారిని చెక్ పోస్టు దగ్గర కానీ, వారు ఆగలేదు. ఎస్ఎస్ఐ భూమినాథన్ కూడా వారిని వదలవద్దని శపథం తీసుకున్నారు. బైక్‌పై ఆ దొంగల(Thieves)ను వెంబడించారు. కొన్ని కిలోమీటర్ల దూరం తర్వాత వారిని పట్టుకోగలిగారు. కానీ, ఆ దొంగలు పోలీసు నుంచి తప్పించుకోవడానికి ఓ కత్తితో మెడపై వేటు వేశారు. ఎస్ఎస్ఐ భూమినాథన్ రక్తపు మడుగులో విలవిల కొట్టుకుంటుండగా ఆ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లో ఆ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.

తిరుచీకి చెందిన భూమినాథన్ నావల్పట్టు పోలీసు స్టేషన్‌లో స్పెషల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన గస్తీ కాసే విధుల్లో ఉన్నారు. రాత్రిపూట ముగ్గురు దుండగులు బైక్‌పై మేకలను దొంగిలిస్తున్నట్టు ఆయన కనిపెట్టారు. వెంటనే వారిని అడ్డుకున్నారు. కానీ, వారు ఆగకుండా బైక్‌ను వేగంగా పోనిచ్చారు. పుదుకొట్టయి రోడ్డు మీదుగా పరారయ్యారు. అది చూసి వారిని పట్టుకునే ఉద్దేశంతో ఎస్ఎస్ఐ భూమినాథన్ కూడా టూ వీలర్‌పై వారిని చేజ్ చేస్తూ వెళ్లారు. కొన్ని కిలో మీటర్లు వారిని చేజ్ చేశారు. చివరికి కీరనూర్ సమీపంలోని పల్లపట్టి రైల్వే సబ్ వే దగ్గర దొంగలను ఆయన పట్టుకోగలిగారు. కానీ, ఆ పోలీసు అధికారి నుంచి తప్పించుకోవడానికి నిందితుడు మణికందర్ కత్తి తీసి భూమినాథన్‌పై వేటు వేశాడు. అంతే, భూమినాథన్ అక్కడే కుప్పకూలిపోయాడు. ముగ్గురు నిందితులు స్పాట్ నుంచి పరారయ్యారు. ఈ కేసులో మణికందన్‌తోపాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు.

Also Read: 50ఏళ్ల మిస్టరీ.. ఫ్లైట్ హైజాక్ చేసి ఆకాశంలోనే మాయమైన ఆ వ్యక్తి వివరాలు ఇంకా రహస్యమే

భూమినాథన్ హత్య కేసు ఛేదించడానికి నలుగురు సభ్యులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్ 24 గంటల్లో నిందితులను పట్టుకుంది. సీసీటీవీ ఫుటేజీ, ఆ లొకేషన్‌లో యాక్టివ్‌గా ఉండిన ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను వారు సులువుగా పట్టుకోగలిగారు. నిందితుడు మణికందన్ పుదుకొట్టయి జిల్లాలో ఎవరికీ చిక్కకుండా తలదాచుకున్నాడు. కానీ, స్పెషల్ టీమ్ ఆయనను పట్టుకుంది. ఆ తర్వాత మేకల దొంగతనం కార్యకలాపాల్లో మరో ఇద్దరు మైనర్లూ ఉన్నట్టు పోలీసులకు తెలిసింది.

మణికందన్‌పై హత్యానేరం, మేకల దొంగతనం కేసులు నమోదయ్యాయి. కీరనూర్ కోర్టు ముందు మణికందన్‌ను హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. అనంతరం రిమాండ్‌లోకి తీసుకుంటామని చెప్పారు. కాగా, మర్డర్ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు మైనర్లను జువైనెల్ బోర్డు ముందు ఉంచుతామని, అబ్జర్వేషన్‌ హోంకు వారిని తరలిస్తామని సెంట్రల్ జోన్ ఐజీ బాలక్రిష్ణన్ తెలిపారు.

Also Read: క్రైం కపుల్స్.. వినూత్న రీతిలో చోరీలు చేసిన ప్రేమికుల జంట.. ఇల్లు అద్దెకిస్తారా అంటూ స్కెచ్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమినాథన్ కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం ప్రకటించారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. భూమి నాథన్ భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసు విధి నిర్వహణలో భూమినాథన్‌కు నిజాయితీ పరుడు అనే పేరు ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios