గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. తీవ్ర అస్వస్థతతో కండోలిమ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. సీఎం హస్పిటల్‌లో చేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. తీవ్ర అస్వస్థతతో కండోలిమ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. సీఎం హస్పిటల్‌లో చేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.. ఇదే విషయాన్ని బీజేపీ నేత మైఖేల్ లోబో ధ్రువీకరించారు.. కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన మనోహర్ పారికర్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈ నెల 6న భారత్ తిరిగి వచ్చారు. ఇప్పుడు మరోసారి పారికర్‌ ఆసుపత్రిలో చేరడం ప్రభుత్వ వర్గాలను, బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.