Asianet News TeluguAsianet News Telugu

కొలీజియం వ్యవస్థలో ప్రాతినిధ్యం ఇవ్వండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ.. తప్పుబట్టిన అరవింద్ కేజ్రీవాల్

కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. అయితే ఈ లేఖను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమని, న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని ఆయన ట్వీట్ చేశారు. 

Give representation in collegium system.. Center's letter to Supreme Court.. Arvind Kejriwal is wrong
Author
First Published Jan 16, 2023, 2:05 PM IST

కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు కొంత కాలం నుంచి వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు ఓ లేఖ రాసింది. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ న్యాయ మంత్రిత్వ శాఖ భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసింది. అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తుల నియామించేందుకు సుప్రీంకోర్టు రెండు అంచెల కొలీజియంలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయోధ్య రామమందిరంపై దాడికి పాక్ ఉగ్ర‌వాదుల కుట్ర‌.. నిఘా హెచ్చ‌రిక‌లు

సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను, హైకోర్టు కొలీజియంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సీజేఐకి రాసిన తాజా లేఖలో సూచించారు. జాతీయ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను మేరకు గతంలో సీజేఐకి రాసిన లేఖలకు ఈ లేఖ కొనసాగింపుగానే ఈ లేఖ ఉందని న్యాయ మంత్రి ఈరోజు తెలిపారు. ‘‘కొలీజియం వ్యవస్థ ఎంఓపీని పునర్నిర్మించాలని రాజ్యాంగ బెంచ్ ఆదేశించింది’’అని రిజిజు అన్నారు.

భర్త చనిపోయిన పదేళ్లకు మరో పెళ్లికి సిద్ధమైన తల్లి.. తట్టుకోలేక ఆ కొడుకు చేసిన పని..

కాగా.. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని కిరెన్ రిజిజు అంతకుముందు పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే న్యాయ శాఖ తాజాగా రాసిన లేఖ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం బ్యాక్‌డోర్ ప్రవేశానికి ప్రభుత్వ సూచన అని సుప్రీంకోర్టు పేర్కొందని పలు నివేదికలు వెల్లడించాయి. 2015లో పార్లమెంట్ ఏకగ్రీవంగా ఎన్‌జేఏసీని ఆమోదించింది. అయితే సుప్రీంకోర్టు 2015లో దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. సీజేఐ నేతృత్వంలో న్యాయశాఖ మంత్రితో పాటు ఇద్దరు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉండాలని, ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసిన ఇద్దరు ప్రముఖులను ఎన్ జేఏసీ ప్రతిపాదించింది. కానీ చట్టం అమల్లోకి రాలేదు.

సుప్రీంకోర్టు, హైకోర్టు కొలీజియం వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత, నిష్పాక్షికత, సామాజిక వైవిధ్యం లోపించడంపై తనకు అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని న్యాయమంత్రి రాజ్యసభకు ఆ సమయంలో తెలిపారు. ఇదిలా ఉండగా.. కొలీజియం వ్యవస్థలో ప్రాతినిధ్యం కోరుతూ కేంద్రం రాసిన లేఖను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఇది అత్యంత ప్రమాదకరమని, న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios