అమ్మాయిలు ధరించే దుస్తులపై అమృతసర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ఆంక్షలు విధించారు. కాలేజీ ఆవరణలో అమ్మాయిలు జీన్స్, టీ షర్ట్స్, స్కర్ట్స్, షాట్స్ వేసుకోవడానికి లేదని తేల్చి చెప్పింది. కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు.. అబ్బాయిల దుస్తులపై కూడా కొన్ని రూల్స్ పెట్టారు. అమ్మాయిలు కూడా ఎలాపడితే అలా డ్రస్ వేసుకోవడానికి లేదు.

ఆఖరికి జీన్స్ వేసుకోవడానికి కూడా లేదు. కేవలం ఫార్మల్స్ మాత్రమే వేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపల్ సుజాత శర్మ  సర్క్యులర్ జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కాలేజీ విద్యార్థులంతా ఈ డ్రస్ కోడ్ ఫాలో అవ్వాలని ఆమె తెలిపారు.  అయితే.. ప్రిన్సిపల్ విధించిన ఆంక్షలు నచ్చని కొందరు విద్యార్థులు.. దీనిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ కోరారు. అయితే.. ఆమె మాత్రం వాటిని తిరస్కరించారు.