Ernakulam: త‌న‌తో బ్రేక‌ప్ చేసుకోవ‌డానికి నిరాక‌రించిన ప్రియుడిని కిడ్నాప్ చేయించి తీవ్ర చిత్ర‌హింస‌ల‌కు గురి చేసింది ఒక యువ‌తి. అయితే, ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో ఇప్పుడు స‌ద‌రు యువ‌తి క‌ట‌క‌టాలపాలైంది. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది.  

love affairex-girlfriend arrested: కేరళలోని వర్కలా సమీపంలోని అయిరూర్ లోని తన మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన టీనేజ్ అమ్మాయిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెరున్నియూర్ కు చెందిన లక్ష్మి ప్రియ(19), బీసీఏ విద్యార్థినిని తిరువనంతపురంలోని ఆమె స్నేహితుడి ఇంట్లో అరెస్టు చేశారు. ఏప్రిల్ 5న ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన కేసులో లక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 10 మంది నిందితులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎర్నాకుళంకు చెందిన అమల్ ను పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మి, ఆ యువకుడు గతంలో రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇటీవల చదువు కోసం ఎర్నాకుళం వెళ్లిన ఆమె అక్కడ మరో యువకుడితో స్నేహం చేసింది. దీంతో ఆమె తన పాత బంధాన్ని తెంచుకోవాలనుకుంది. అయితే లక్ష్మి డిమాండ్ కు అయిరూర్ వాసి అయిన త‌న మాజీ ప్రియుడు అంగీకరించకపోవడంతో ఆమె, ఆమె మరో ఆరుగురు స్నేహితులు అతడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. 

పోలీసులు ఈ విషయం గురించి వివ‌రిస్తూ.. యువ‌కుడిని కిడ్నాప్ త‌ర్వాత‌, తీవ్రంగా దాడి చేసి నగ్నంగా రోడ్డుపై పడేసిన కేసులో బాధితుడి మాజీ ప్రియురాలు స‌హా ప‌లువురిని అరెస్టు చేసిన‌ట్టు చెప్పారు. నిందితురాలైన ల‌క్ష్మీప్రియతో బ్రేక‌ప్ చేసుకోవ‌డానికి బాధితుడు నిరాక‌రించ‌డంతో ఈ దాడి జరిగింద‌ని తెలిపారు. లక్ష్మీప్రియ ఆదేశాల మేరకే ఓ ముఠా యువకుడిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. యువతి తనతో సంబంధాన్ని తెంచుకోవడానికి నిరాకరించడంతో యువతి ఒక గ్యాంగ్, తన ప్రస్తుత ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స‌మాచారం. ఈ కేసులో లక్ష్మీప్రియను మొదటి నిందితురాలిగా చేర్చారు. ఈ కేసులో ఎనిమిదో నిందితుడైన ఎర్నాకుళానికి చెందిన అమల్ (24)ను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రేమికులు కాదు.. అసభ్యకర వీడియోలు పంపి, కూతురిని వేధించాడు: లక్ష్మీప్రియ తల్లి

ఈ విషయమై లక్ష్మీప్రియ తల్లి.. తన కుమార్తెకు ఆ యువకుడితో సంబంధం లేదనీ, వారు ప్రేమికులు కాద‌ని చెప్పిన‌ట్టు మనోరమ న్యూస్ నివేదించింది. "వారిద్దరూ స్నేహితులు. అయితే ఆ తర్వాత ఆమెను అసభ్య పదజాలంతో వేధించడంతో పాటు ఆమె ఫోన్ కు అశ్లీల వీడియోలు కూడా పంపాడు. తన కష్టాల నుంచి బయటపడేందుకు తన స్నేహితులను సాయం చేయమని కోరింది' అని లక్ష్మీప్రియ తల్లి తెలిపారు. అలాగే, యువకుడిపై దాడి చేసేందుకు లక్ష్మీప్రియ ఎలాంటి కొటేషన్ ఇవ్వలేదని చెప్పారు. ఆ యువకుడిని కొట్టింది ఆమె స్నేహితులే తప్ప నా కూతురు కాద‌నీ, ఆమె ఎప్పుడూ అలాంటి పని చేయదన్నారు. లక్ష్మి టాలెంటెడ్ స్టూడెంట్ అనీ, దీనిపై అనుమానం ఉంటే టీచర్లను అడగొచ్చున‌ని చెప్పారు.

ల‌క్ష్మీ ప్రియ డ‌బ్బులు డిమాండ్ చేసింది.. : బాధితుడి తండ్రి 

తన కొడుకును కిడ్నాప్ నుంచి విడిపించేందుకు లక్ష్మీప్రియ డబ్బులు డిమాండ్ చేసిందని యువకుడి తండ్రి ఆరోపించారు. బాలిక, ఆమె స్నేహితులు కలిసి తన కుమారుడిపై దారుణంగా దాడి చేశారని వెల్లడించాడు. బాలిక తన కొడుకును మోసగించి కారులో తీసుకెళ్లిందని పేర్కొన్నారు. కారులోకి ప్రవేశించిన వెంటనే, ఆమె స్నేహితులు అతన్ని కొట్టడం ప్రారంభించారు. మార్గమధ్యంలో అలప్పుజాలో ఆగి ఆ యువకుడి బంగారు గొలుసు, ఖరీదైన మొబైల్ ఫోన్, నగదు ఎత్తుకెళ్లారని అన్నారు. అనంతరం ఎర్నాకులంలోని తమ్మనం సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. ఆ గుంపు అతడిని అక్కడే కట్టేసి కొట్టారు. న‌గ్నంగా చేసి ఫోన్ లో వీడియోలు, ఫొటోలు తీశార‌ని తెలిపారు.