Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించి పెళ్లాడిన పాపానికి ఆ యువతిని......

బిహార్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామ కట్టుబాట్లు పేరుతో ఓ యువతికి నరకం చూపించారు గ్రామ పెద్దలు. కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో నానా యాతన పెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ యువతిని గ్రామ పంచాయితీ పెద్దలు దారుణంగా చితక్కొట్టారు. 

Girl tied to tree, thrashed by villagers in Bihar
Author
Bihar, First Published Oct 6, 2018, 9:29 PM IST

నవాడా: బిహార్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామ కట్టుబాట్లు పేరుతో ఓ యువతికి నరకం చూపించారు గ్రామ పెద్దలు. కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో నానా యాతన పెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ యువతిని గ్రామ పంచాయితీ పెద్దలు దారుణంగా చితక్కొట్టారు. 

తమ కులం కాని అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కారణంతో ఆమె కాళ్లు చేతులు తాళ్లతో కట్టి ఆ తర్వాత ఆమెను చెట్టుకు కట్టేశారు. గ్రామానికి చెందిన పంచాయితీ పెద్దలు ఆమెను చావు దెబ్బలు కొట్టారు.  

అలా పావుగంట కాదు అరగంట కాదు ఏకంగా గంటల  సేపు చావబాదారు. తనను వదిలేయాలని కన్నీటితో మెురపెట్టుకున్న పంచాయితీ పెద్దలు కరుణించలేదు. చెట్టుకు కట్టేసి యువతిని కొడుతున్నా చూస్తున్న వాళ్లు కూడా కాస్త కనికరం చూపలేదు. అయ్యోపాపం అన్నవారు కూడా లేరు. తల్లిదండ్రలు ఉన్నా పంచాయితీ పెద్దల తీర్పుకు తలొగ్గారు.  

పట్నా సమీపంలోని నవాడాకు చెందిన ఓ యువతి వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లి ఇష్టంలేని ఆ యువతి ఏడాదిన్నర క్రితం వేరే యువకుడితో పారిపోయింది. 

ఆమె కోసం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంత వెతకడం ప్రారంభించారు. ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత ఆమె ఆచూకీ కనిపెట్టిన గ్రామస్థులు కుటుంబ సభ్యులు ఆమెను తీసుకువచ్చి పంచాయితీ పెద్దలకు అప్పగించారు. 

పంచాయితీ కట్టుబాటులంటూ వారు ఆయువతిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. గంటలకొద్ది ఆ యువతిని కొట్టడంతో దెబ్బలకు తాళలేక ఆ యువతి స్పృహ కోల్పోయింది. అయినప్పటికీ గ్రామస్తులు చోద్యం చూస్తున్నారే తప్ప గుక్కెడు నీళ్లిచ్చిన పాపాన పోలేదు. 

ఇంతలో ఓ పెద్దమనిషి ఆమె జుట్టుపట్టుకుని కర్రతో మళ్లీ కొట్టాడు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే బాగుండదని హెచ్చరించాడు. ఆ తర్వాత గ్లాసులో మంచినీళ్లు తెచ్చి తాగించి వదిలేశారు.  

 ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నవాడా గ్రామానికి చేరుకుని యువతిని విచారించారు. ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు అన్న అంశాలపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios