ఆమె పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. తనతోపాటు చదివే కుర్రాడు.. ప్రేమ పేరిట దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. దీంతో.. బాలిక అతనికి శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా.. ఇటీవల ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలోని హులికుంట సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

Also Read రైల్లో మహిళా బాక్సర్ పై కోచ్ అఘాయిత్యం...

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలిక, భూతేష్‌ టెన్త్‌ క్లాస్‌లో కలిసే చదివారు. అప్పటి నుంచి స్నేహంగా ఉన్న అతను బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. 

బాలికకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా గర్భవతి అని, కాన్పు నొప్పులు వస్తున్నాయని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ప్రస్తుతం బాలిక ఆడశిశువుకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు, వారికి మెరుగైన వైద్యం ఆందించడానికి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

కాగా... బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు భూతేష్ ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.