గర్ల్‌ఫ్రెండ్ పై అనుమానం.. స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపిన దుండగుడు
ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా జిల్లాలో ఓ యువతిని ఆమె లవర్ 51 సార్లు స్క్రూ డ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై జరిగిన దాడిని మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Raipur: ఢిల్లీలో మైనర్ బాలికను సాహిల్ అనే యువకుడు 40 సార్లు కత్తితో పొడిచి చంపేసిన ఘటన మరువక ముందే ఛత్తీస్‌గడ్‌లో మరో దర్ఘటన జరిగింది. ఓ యువతిని ఆయన బాయ్‌ఫ్రెండ్ స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపేశాడు. ఆ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదనే అనుమానంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది.
కోర్బా జిల్లా సీఎస్ఈబీ పోలీసు స్టేషన్ సమీపంలోని పంప్ కాలనీకి చెందిన నీలం కుసుం పన్నా.. బస్ కండక్టర్ షాబాజ్‌కు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వారి మధ్య సంబంధం క్షీణించిన తర్వాత షాబాజ్ కొత్త జాబ్ వెతుక్కుంటూ గుజరాత్‌కు వెళ్లాడు. గుజరాత్ వెళ్లిన తర్వాత నీలం, షాబాజ్ మధ్య మళ్లీ సంబంధం కొనసాగింది. ఈ సారి వీరి మధ్య సంబంధం బలపడింది. కానీ, నీలం కుసుం పన్నాపై షాబాజ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని అనుకున్నాడు.
గతేడాది షాబాజ్ గుజరాత్ నుంచి కోర్బాకు క్రిస్మస్ పండుగకు ఒక రోజు ముందే చేరుకున్నాడు. అతను నేరుగా కుసుం ఇంటికి వెళ్లాడు. ఆమె పండుగ కోసం రెడీ అవుతున్నది.
అప్పుడే ఓ స్క్రూ డ్రైవర్‌తో కుసుంపై షాబాజ్ దాడి చేశాడు. చాతిలో 34 సార్లు, వెనుక వైపున 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
Also Read: లవ్ జిహాద్ కేసు పెట్టిన వారికి దిమ్మ దిరిగే ట్విస్ట్.. ఆ ఎఫైర్ తో షాక్.. ఉత్తర ప్రదేశ్ లో ఘటన
పోలీసులు అతడిని పట్టుకున్నారు. నేరాన్ని షాబాజ్ అంగీకరించాడు.
ఇటీవలే ఢిల్లీలో 16 ఏళ్ల బాలికను నిందితుడు సాహిల్ 40 సార్లకంటే పైగా పొడిచి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేరాన్ని కూడా సాహిల్ అంగీకరించాడు. 16 ఏళ్ల బాలిక సాక్షిని చంపినందుకు పశ్చాత్తాపాన్ని కూడా ప్రకటించలేదు.