అయోధ్యకు మన తెలుగు రాష్ట్రాల కానుకలు.. ఏం పంపించామంటే ?
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక (ayodhya ram mandir pran pratishtha celebrations) కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమం కోసం ప్రపంచ నలు మూలల నుంచి కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు కూడా అయోధ్యకు కానుకలు (Gifts of Telugu states to Ayodhya) పంపించాయి.
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయింది. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టానికి మరి కొన్ని నిమిషాలే సమయం ఉంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశంలోని దేవాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట.. 84 సెకన్ల పాటు 'మూల ముహూర్తం'
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ.. ఆ నీలమేఘశ్యాముడికి ప్రపంచ నలుమూలల నుంచి కానుకలు వచ్చాయి. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అయోధ్య బాల రాముడికి విశిష్ట కానుకలు పంపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించింది. అలాగే చేనత పరిశ్రమకు పేరుగాంచిన సిరిసిల్ల నుంచి సీతమ్మ తల్లికి బంగారు చీర కానుకగా పంపించారు.
రంగురంగుల పూలతో మెరిసిపోతున్న ఆయోధ్య రామాలయం.. స్పెషల్ ఫొటోలు ఇవిగో..
హైదరాబాద్ నుంచి 1265 కిలోల లడ్డూ కూడా తరలి వెళ్లింది. అలాగే ఇదే భాగ్య నగరం నుంచి ముత్యాల హారం వంటి కానుకలు వెళ్లాయి. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లడ్డూలతో ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఆ లడ్డులను అక్కడ ప్రసాదంగా అందజేయనున్నారు. ఆయన కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన లడ్డూ కూడా అక్కడి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.
అయోధ్య ఆలయం కోసం నేపాల్ పవిత్ర శాలిగ్రామ్ శిలలను పంపించింది. దీనితో ఆలయంలోని విగ్రహాలను రూపొందించవచ్చు. అలాగే శ్రీలంక పవిత్రమైన సీతా ఎలియా శిలను పంపించింది. అశోక వాటిక నుంచి శ్రీరాముడి చరణ పాదుకలను పంపించింది. థాయిలాండ్ రెండు పవిత్ర నదుల జలాలను పంపించింది. ఇలా పలు దేశాలు శ్రీరాముల వారికి రకరకాల కానుకలు పంపించారు.