Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట.. 84 సెకన్ల పాటు 'మూల ముహూర్తం'

ప్రపంచ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట (ayodhya ram mandir pran pratishtha) కు ఇంకా మరి కొన్ని గంటలే సమయం ఉంది.  12:29:08 గంటలకు ప్రాణప్రతిష్ట వేడుక జరగనుంది. 84 సెకన్ల (84 seconds)పాటు ఉండే మూల ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) రామ్ లల్లా విగ్రహాన్ని ( Ram Lalla) ప్రతిష్టించనున్నారు.

Ayodhya Ram Mandir pran pratishtha.. 'Mula Muhurtam' for 84 Seconds..ISR
Author
First Published Jan 22, 2024, 10:18 AM IST

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల నేపథ్యంలో దేశ మొత్తం రామ నామస్మరణతో మారుమోగుతోంది. దేవాలయాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. ప్రపంచ నలుమూల నుంచి ఇప్పటికే భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. సాధువులు, భక్తుల కోసం  రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లూ చేసింది. అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం వేద పండితులు మంచి ముహుర్తాన్ని ఖరారు చేశారు. నేటి (సోమవారం) మధ్యాహ్నం 12:29:08 గంటలకు 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరనుంది. 84 సెకన్ల పాటు ఉండే ఈ మూల ముహూర్తంలో చారిత్రాత్మక సుందర దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆ మూల ముహూర్తంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 

ఈ ప్రారంభమైన దగ్గర నుంచి భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తడానికి 25 రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలు దాదాపు రెండు గంటల పాటు వాయిస్తాయి. ప్రాథమిక ఆచారాలు ప్రారంభానికి ముందు "మంగళ ధ్వని" సృష్టిస్తాయి. ప్రధాని మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించిన తరువాత చిన్న బంగారు కర్రతో కాజల్ ను పూయనున్నారు. అనంతరం స్వామివారికి చిన్న దర్పణం సమర్పించి, అనంతరం 108 దీపాలతో మహా హారతి ఇచ్చి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ముగిస్తారు.

అనంతరం ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులతో ప్రధాని మమేకమవుతారు. పురాతన శివాలయాన్ని క్షుణ్ణంగా పునరుద్ధరించిన కుబేర్ తిలాను సందర్శిస్తారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన పదిహేను మంది యజ్ఞులతో పాటు ఆలయంలో పూజలు కూడా జరగనున్నాయి. 

ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకోనున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆలయ ప్రాంగణంలోనే ఉండి, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాగా.. అయోధ్య ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రధానికి లేఖ రాశారు.

ఇదిలా ఉండగా.. ఆలయ ప్రాణప్రతిష్ట అనంతరం భక్తులందరూ అయోధ్యను సందర్శింవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. జనవరి 27 తర్వాత ఆలయ సందర్శనలను ప్లాన్ చేసుకోవాలని ప్రజలను కోరింది. అయితే ట్రస్ట్ భక్తులు రాకూడదని అభ్యర్థించినప్పటికీ సరిహద్దులను మూసివేసే సమయానికి ముందే పెద్ద సంఖ్యలో భక్తులు నగరానికి చేరుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios