Asianet News TeluguAsianet News Telugu

కొత్త పార్టీ పెడతా .. బీజేపీలో చేరను : గులాంనబీ ఆజాద్ సంచలన ప్రకటన

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ సంచలన ప్రకటన చేశారు. జమ్మూకాశ్మీర్‌లో తాను కొత్త పార్టీ పెడతానని తెలిపారు

Ghulam Nabi Azad to form party in J&K
Author
First Published Aug 26, 2022, 3:12 PM IST

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరేది లేదని... జమ్మూకాశ్మీర్‌లో కొత్త పార్టీ పెడతానని ఆజాద్ ప్రకటించారు. కాశ్మీర్‌లో ఇతర పార్టీలతో కలిసి అధికారం పంచుకునే ఆలోచనలో ఆయన వున్నారు. ఆజాద్ నిర్ణయం పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుందనే అంచనాలు వున్నాయి. రానున్న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఆజాద్. 

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో మారిన పరిస్థితులే తన రాజీనామాకు కారణమని దాదాపు చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత, ఎన్నో కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం పంచుకున్న గులాం నబీ ఆజాద్ రాజీనామా కాంగ్రెస్‌కు పెద్ద షాకేనని నిపుణులు చెబుతున్నారు.

ఈ మేరకు ఆయన ఐదు పేజీల రాజీనామా లేఖ రాశారు ఆజాద్. ఇందులో పార్టీతో తన జీవిత ప్రయాణం గురించి, పార్టీ సాధించిన విజయాలు, అపజయాలను ప్రస్తావించారు. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో సోనియా గాంధీ తీరును మెచ్చుకుంటూనే ప్రస్తుత పరిణామాలపై విమర్శలు చేశారు. కొన్ని సూచనలూ చేశారు. కాగా, రాహుల్ గాంధీపై మాత్రం విరుచుకుపడ్డారు. ఆయన తన రాజీనామా లేఖలో పార్టీలో ప్రతికూల పరిస్థితులు, తప్పుడు పద్ధతులను ఎత్తి చూపారు. తన రాజీనామాకు పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులనే కారణంగా చూపించారు. ఐదు పేజీల తన రాజీనామా లేఖలో ఎక్కువగా పార్టీపై ఘాటు విమర్శలు ఉన్నాయి. ఆయన పేర్కొన్న లోపాలను కారణంగా చూపి రాజీనామా చేస్తున్నట్టు వివరించారు.

ALso REad:గులాం నబీ ఆజాద్ ఎందుకు రాజీనామా చేశారు? ఆయన చెప్పిన కారణాలేమిటీ?

రాహుల్ గాంధీ పిల్ల చేష్టల కారణంగా 2014లో కాంగ్రెస్ ఓడిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉండే సంప్రదింపుల వ్యవస్థను సర్వం నాశనం చేశారని మండిపడ్డారు. ఆయన చుట్టూ కొత్తగా సైకోల కోటరీ ఒకటి ఏర్పడిందని, ఇప్పుడు వారే పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారని విమర్శించారు. ఆయన గార్డులు, పర్సనల్ అసిస్టెంట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.

ఒకప్పుడు కాంగ్రెస్ అంటే జాతీయ ఉద్యమం.. దేశ స్వాంత్ర్యం కోసం పోరాడిన పార్టీ అని గుర్తు చేస్తూ.. ఇప్పుడు కొందరు ఆ పార్టీని శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని పరితపిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వ్యవస్థాగత ఎన్నికలు కేవలం ఉట్టి మాయ అని విమర్శించారు. ఒక వేళ గాంధీయేతరులను అధ్యక్షులుగా ఎన్నుకున్నా వారు కీలు బొమ్మకు మించి మరేమీ కాదని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios