గాజా సరిహద్దుపై పట్టు సాధించిన ఇజ్రాయెల్.. 1500 మంది హమాస్ దళాల మృతదేహాలు లభ్యం

గజా బార్డర్ పై ఇజ్రాయెల్ దళాలు పూర్తిపట్టును సాధించాయి. ఇజ్రాయెల్ సైన్యం సరిహద్దును హస్తగతం చేసుకుంది. ఇక నుంచి సరిహద్దు గుండా ఒక్క హమాస్ మిలిటెంట్ కూడా లోపలికి రాలేరని ఐడీఎఫ్ పేర్కొంది.

Israel captures Gaza border, bodies of 1500 Hamas soldiers found..ISR

ఇజ్రాయెల్ పై గత శనివారం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గత శనివారం ఆకస్మికదాడికి దిగింది. ఈ సందర్భంగా గజా సరిహద్దుల్లోని కొన్ని భాగాలను హమాస్ పేల్చి వేసింది. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ దళాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. తాజాగా గాజా సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం పూర్తి పట్టు సాధించింది. ఈ విషయాన్ని రక్షణ దళాల ఉన్నత ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరి మంగళవారం ప్రకటించారు. కాగా.. ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1,500 హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

ఇజ్రాయెల్-పాలస్తీనాకు మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం.. 1,600 మంది మృతి..

కంచె గుండా ఒక్క ఉగ్రవాది కూడా ప్రవేశించలేడని రియర్ అడ్మిరల్ డేనియల్ తెలిపారు. చివరి రోజు ఒక్క ఉగ్రవాది కూడా కంచె గుండా లోపలికి ప్రవేశించలేదని చెప్పారు. దాక్కున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.  అయితే ఇజ్రాయెల్ భూభాగంలో ఇంకా తక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది.

నెరవేరిన లతా మంగేష్కర్ చివరి కోరిక.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన కుటుంబం..

కాగా.. గాజా-ఈజిప్ట్ సరిహద్దు క్రాసింగ్ ను మూసివేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) కూడా లెబనాన్ సరిహద్దు వెంబడి తన ఉనికిని పెంచుకుంది. వివాదాస్పద ప్రాంతంలో ఘర్షణల తరువాత పదుల సంఖ్యలో అదనపు దళాలను చేర్చిందని ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జొనాథన్ కాన్రికస్ తెలిపారు.

షోపియాన్ లో ఎన్ కౌంటర్.. కాశ్మీర్ పండిత్ హత్య కేసులో ఉగ్రవాది సహా మరొకరు హతం..

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ పై హమాస్ అనాగరిక దాడి చేయడంతో కనీసం 900 మంది ఇజ్రాయెలీలు మరణించగా, 2,616 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ పై గాజా నుంచి 4,500 రాకెట్లను ప్రయోగించామని, ఆ తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాలోని 1290 హమాస్ స్థావరాలపై దాడి చేశాయని ఐడీఎఫ్ షేర్ చేసిన వార్ అప్ డేట్ లో పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios