బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కొడవ సామాజిక సంప్రదాయం ప్రకారంగా  అమెరికాలో ' గే' జంట వివాహం చేసుకొంది.ఈ వివాహంపై  కుల పెద్దలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని శరత్ పొన్నప్ప ... కొడవ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో డాక్టర్ గా పనిచేస్తున్న సందీప్ దోసాంజిని డిసెంబర్ 26న పెళ్లి చేసుకొన్నాడు.

కొందరు స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ సామాజికవర్గం పాటిస్తున్న సంప్రదాయం ప్రకారంగా శరత్ పెళ్లి చేసుకోవడంపై  కొడవ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మడికెరి కొడవ సమాజ అధ్యక్షుడు కేఎస్ దేవయ్య ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి మచ్చతెచ్చేలా శరత్ వ్యవహరించాడని  ఆయన మండిపడ్డారు.

శరత్ ను వెలివేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ పెళ్లితో తమకు సంబంధం లేదన్నారు. సంప్రదాయాలను అవమానపర్చొద్దని ఆయన హితవు పలికారు. ఈ పెళ్లిపై శరత్ తల్లిదండ్రులు నిరాకరించారు.