భారత్ లో స్వలింగ సంపర్కుల హక్కులకు ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు ఇవ్వాలని ఇండో అమెరికన్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఆ హక్కులకు అర్హులని తెలిపారు. 

భారతదేశంలోని ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ సమాన హక్కులకు మద్దతు ఇవ్వాలని భారత సంతతి అమెరికన్ ఎల్జీబీటీక్యూ సభ్యులు శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ‘‘స్వలింగ సంపర్కుల వివాహం, ఎల్జీబీటీక్యూ వివాహం అంశంపై భారత సుప్రీంకోర్టు కొన్ని నెలలుగా చర్చిస్తోందని నేను చెప్పగలను. భారతదేశంలోని ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ సమాన హక్కులకు మద్దతు ఇవ్వాలని, మన పిల్లలు, ఎల్జీబీటీక్యూ ప్రజలు సమాన హక్కులకు అర్హులని అర్థం చేసుకోవాలని నేను ప్రధాని మోడీని కోరుతున్నాను. ఎందుకంటే మనమందరం మానవులం’’ అని దేశీ రెయిన్ బో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ రావు వార్త సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు.

బిపార్జోయ్ తుఫాను బీభత్సం.. పాకిస్థాన్ లో 25 మంది మృతి, 140 మందికి గాయాలు

అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ప్రసంగించిన వైట్ హౌస్ లోని సౌత్ లాన్స్ లో చారిత్రాత్మక ప్రైడ్ ర్యాలీలో పాల్గొనడానికి ఆహ్వానించబడిన కొద్ది మంది భారతీయ అమెరికన్లలో రావు ఒకరు. ‘‘మెట్రో ప్రాంతాల్లో ఎల్జీబీటీక్యూ ప్రజలకు కొంత మద్దతు ఉంది. చట్టపరంగా కూడా ట్రాన్స్ జెండర్ హక్కుల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లింది. కానీ చేయాల్సింది చాలా ఉంది.’’ అని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా భారత్, దక్షిణాసియాలోని ఎల్జీబీటీక్యూ ప్రజలకు అన్ని విధాలుగా మద్దతు అవసరమని రావు అన్నారు.

జర్నలిస్టుతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వాగ్వాదం.. వీడియో పోస్టు చేస్తూ మండిపడ్డ కాంగ్రెస్.. వైరల్

వైట్ హౌస్ ప్రైడ్ ర్యాలీలో పాల్గొన్న మరో భారతీయ అమెరికన్ లెస్లీ కింగ్ స్టన్.. ఈ నెలాఖరులో అధ్యక్షుడు బైడెన్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మంచి సమావేశం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. కానీ ప్రధాని మోడీ నిజంగా దక్షిణాసియా, ఇక్కడి భారతీయ సమాజాన్ని పరిశీలించి పురోగతి కోసం మనం ఎలా కష్టపడుతున్నామో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే భారతదేశంలోని ఎల్జీబీటీక్యూలకు హక్కులను ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు దానికి అర్హులు’’ అని తెలిపారు. 

13 ఏళ్ల బాలిక కిడ్నాప్.. లాడ్జీలో బంధించి 10 రోజుల పాటు రేప్.. సంచలన తీర్పు చెప్పిన కోర్టు

కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈ నెలలో తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 21 నుంచి నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ జూన్ 22న మోడీకి విందు ఇవ్వనున్నారు.