పాకిస్థాన్ ను బిపార్జోయ్ తుఫాను అతలాకుతలం చేస్తోంది. భారీగా ప్రాణనష్టం సంభవించడంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లుతోంది. ఈ తుఫాను ప్రభావం వల్ల ఇప్పటి వరకు 25 మంది చనిపోయారు. 140 మంది గాయపడ్డారు. 

బిపార్జోయ్ తుఫానును పాకిస్థాన్ ను అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో శనివారం ఈ తుఫాను బీభత్సం వల్ల 25 మంది మృతి మరణించారు. 140 మందికి పైగా గాయపడ్డారు.

13 ఏళ్ల బాలిక కిడ్నాప్.. లాడ్జీలో బంధించి 10 రోజుల పాటు రేప్.. సంచలన తీర్పు చెప్పిన కోర్టు

కాగా.. కేపీలోని బన్ను, డేరా ఇస్మాయిల్ ఖాన్, కరాక్, లకీ మార్వాట్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 25 మంది మృతి చెందగా, 145 మంది గాయపడ్డారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. వర్షాల కారణంగా 69 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ‘జియో న్యూస్’ తెలిపింది.

Scroll to load tweet…

బాను ప్రాంతంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మంది గాయపడ్డారు. 68 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లకీ మార్వాట్ జిల్లాలో ఐదుగురు మృతి చెందగా, 42 మంది గాయపడ్డారు. కరాక్ లో నలుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ లో వర్షాల కారణంగా ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. లకి మార్వాత్ బన్ను తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పైకప్పు కూలిపోవడంతో బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అసహజ శృంగారం కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు - తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఆరోపణలు

కాగా.. తుఫాను ప్రభావిత జిల్లాల్లోని హాస్పిటల్స్ కు హై అలర్ట్ ప్రకటించినట్టు ఖైబర్ పఖ్తుంఖ్వా సమాచార శాఖ మంత్రి ఫిరోజ్ జమాల్ షా తెలిపారు. బాధిత ప్రాంతాల అధికారులతో తాత్కాలిక ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. సర్గోధా, గుజ్రాన్ వాలా, ఫైసలాబాద్ తదితర జిల్లాలతో సహా పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఖుషాబ్ జిల్లాలోని చాన్ గ్రామంలో కుండపోత వర్షాలకు ఇంటి గోడ కూలి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు.

మహబూబాబాద్ లోని రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. రూ. 2 కోట్ల విలువైన యంత్రాలు, 15 వేల క్వింటాళ్ల ధాన్యం దహనం

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాహిద్ అక్రమ్ దుర్రానీతో ఫోన్లో మాట్లాడారని, వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టంపై విచారం వ్యక్తం చేశారని ‘జియో న్యూస్’ నివేదిక తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఖైబర్ పఖ్తుంఖ్వా చీఫ్ సెక్రటరీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ)ను ఆదేశించారు.