Asianet News TeluguAsianet News Telugu

బిలియనీర్ల జాబితాలో టాప్ లూజర్ గా గౌత‌మ్ అదానీ.. మ‌రోసారి షేర్ల క్షీణ‌త..

Adani Group: గౌత‌మ్ అదానీ నికర సంపద గణనీయంగా పడిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. ఈ గ్రూపుకు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ ఒక నివేదికను విడుదల చేసినప్పుడు ఇది 119 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు అది 45.5 డాలర్లకు పడిపోయింది. దీంతో బిలియనీర్ల జాబితాలో టాప్ లూజర్ గా గౌత‌మ్ అదానీ నిలిచారు.

Gautam Adani is the top loser in the list of billionaires. Once again, the shares are down.
Author
First Published Mar 14, 2023, 2:16 PM IST

Adani’s net worth drops again: హిండెన్ బ‌ర్గ్ నివేదిక త‌ర్వాత అదానీ గ్రూప్ షేర్లు గ‌ణ‌నీయంగా ప‌డిపోయాయి. బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో వేగంగా క్షీణించడంతో ఆయన నికర విలువ మరింత పడిపోయింది. బ్లూమ్ బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ డేటా ప్ర‌కారం.. అదానీ నికర విలువ 46.1 బిలియన్ డాలర్లుగా ఉందని గ‌త ఫిబ్ర‌వ‌రి 22న పేర్కొంది. అంత‌కుముందు నెల రోజుల క్రితం మూడో స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 27వ స్థానానికి పడిపోయారని పేర్కొంది. అయితే, కొన్ని ట్రేడింగ్ సెషన్లలో ఎగువ ధోరణిలో ఉన్న అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు మ‌ళ్లీ క్షీణించాయి. దీని ఫలితంగా ఆదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 1.7 బిలియన్ డాలర్లకు ప‌డిపోయింది.

ప్రపంచ కుబేరుల జాబితాలో 25వ స్థానానికి అదానీ..

అదానీ నికర సంపద గణనీయంగా పడిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. అదానీ గ్రూపున‌కు సంబంధించిన హిండెన్ బర్గ్ ఒక నివేదికను విడుదల చేసినప్పుడు ఇది 119 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు అది 45.5 డాలర్లకు పడిపోయింది. అదానీ పవర్, అదానీ ట్రాన్స్ మిష‌న్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు లోయర్ సర్క్యూట్ లో ముగిశాయి. అదానీ పవర్, అదానీ ట్రాన్స్ మిష‌న్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు లోయర్ సర్క్యూట్స్ లో ఉండ‌గా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్, ఏసీసీ, అంబుజా సిమెంట్ సహా ఇతర అదానీ కంపెనీల షేర్లు రెడ్ లో ట్రేడవుతున్నాయి. న‌ష్టాల్లో కొన‌సాగుతున్న నేప‌థ్యంలో గౌతమ్ అదానీ నికర విలువను ప్రభావితం చేస్తున్నాయి. 

అంత‌కుమందు, ఈ ఏడాది జనవరి 24న యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన ఒక  నివేదిక తరువాత గౌతమ్ అదానీ నికర విలువ 70 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయింది. సరిగ్గా చెప్పాలంటే, యూఎస్ షార్ట్ సెల్లర్ నివేదికను విడుదల చేసినప్పటి నుండి బిలియనీర్ గౌత‌మ్ అద‌నీ  నికర విలువ 72.9 బిలియన్ డాలర్లు క్షీణించింది.

బిలియనీర్ల జాబితాలో టాప్ లూజర్.. 

బిలియనీర్ల జాబితాలో అదానీ మరోసారి టాప్ లూజర్ గా నిలిచారు. తాజాగా ఒక్కరోజులో బిలియనీర్ 1.7 బిలియన్ డాలర్లు అంటే తన నికర విలువలో 3.66 శాతం కోల్పోయారు.

టాప్-10 బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ భారతదేశపు అత్యంత ధనవంతుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుత టాప్ 10 బిలియనీర్ల జాబితాలో ఎనిమిది మంది అమెరికన్లు, ఫ్రాన్స్ కు చెందిన ఒకరు, మెక్సికోకు చెందిన ఒకరు ఉన్నారు. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్ట్ 192 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios