ప్రకాశ్ రాజ్ హత్యకు కుట్ర

Gauri killers planned to kill actor prakash raj, reveals SIT
Highlights

వెల్లడించిన సిట్ అధికారులు

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ని హత్య చేసేందుకు కుట్ర పన్నారా..? అవుననే అంటున్నారు ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) అధికారులు. అసలు ప్రకాశ్ రాజ్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేగా మీ సందేహం.

అసలు మ్యాటరేంటంటే.. జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య కేసులో పలు రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె హత్య కేసు దర్యాప్తు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అప్పట్లో ఈ విషయంపై ఆయన పలు రాజకీయ నాయకుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. గౌరీ లంకేష్‌ తనకు మంచి స్నేహితురాలని ప్రకాశ్‌రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె నిజాయతీగా ఉండేవారని, తన హత్య చాలా బాధించిందని ఆయన అన్నారు.

అయితే గౌరీ లంకేష్‌ హత్య కేసును విచారించిన సిట్ అధికారులు తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. దోషులు ప్రకాశ్‌రాజ్‌ను కూడా హత్య చేయాలని ప్లాన్ వేసారని అధికారులు తెలిపారు.  ఇటీవల ఈ వార్తల్ని కన్నడ మీడియా ప్రచురించగా.. వాటిని చూసిన ప్రకాశ్‌రాజ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఇకపై తన గళం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ‘మీరు పిరికివాళ్లు.. విద్వేషపూరితమైన రాజకీయాలకు మీరు దూరంగా ఉంటారని భావిస్తున్నారా?’ అని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు.

loader