Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి వేడుకల్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు సజీవదహనం.. 50 మందికి గాయాలు..

రాజస్థాన్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకల్లో సిలిండర్ పేలడంతో ఇది సంభవించింది.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తంగా నలుగురు చనిపోయారు. 50 మందికి గాయాలు అయ్యాయి. 

Gas cylinder exploded during wedding ceremony.. 4 people were burnt alive.. 50 people were injured..
Author
First Published Dec 9, 2022, 8:55 AM IST

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని భుంగ్రా గ్రామంలో గురువారం పెళ్లి వేడుకల సందర్భంగా గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే జోధ్ పూర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో 35 మందికి పైగా 60 శాతానికి పైగా గాయాలయ్యాయి. 11 మందికి 80 నుండి 90 శాతం కాలిన గాయాలు ఉన్నాయి.

భద్రతా నిబంధనల అంశంపై రైల్వే బోర్డుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్ర‌హం

పెళ్లి వేడుకల జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. ఒక్క సారిగా అగ్ని చెలరేగడంతో టెంట్ కిందట ఉన్న మహిళలు, చిన్నారులకు మంటలంటుకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సమీపంలోని ట్యాంకర్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాద సమయంలో తొక్కిసలాట జరిగింది. 

ఫలితాలు ఊహించినట్లుగానే ఉన్నాయి: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ కామెంట్స్

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్తా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారని తెలిపారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పులు నేలకొరిగిందని అన్నారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు.

కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios