Asad Ahmed Encounter: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్ సార్ట్ అతిక్ అహ్మద్ కుమారుడు, ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడు అసద్ అహ్మద్ గురువారం ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దాదాపు రెండు నెలలుగా యూపీ పోలీసులు, ఎస్టీఎఫ్ బృందం అసద్ అహ్మద్‌ను ఫాలో అయ్యారు.
Asad Ahmed Encounter: ఉత్తరప్రదేశ్ లో ఒక్కసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు, ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడైన అసద్ అహ్మద్ గురువారం ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దాదాపు రెండు నెలలుగా యూపీ పోలీసులు, ఎస్టీఎఫ్ బృందాలు అసద్ అహ్మద్‌ను ఫాలో అవుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అసద్‌తో పాటు షూటర్ గులాం కూడా హతమయ్యాడు. వీరిద్దరిపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది.
కీలక పరిణామాలు..
>> 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే హత్యకేసులో ప్రధాని సాక్షి అయిన లాయర్ ఉమేష్ పాల్ 2023 ఫిబ్రవరి 24న హత్యకు గురయ్యాడు. ఉమేష్ పాల్ ను ప్రయాగ్‌రాజ్‌లోని తన ఇంటి బయట కాల్చి చంపారు. అతని భద్రత సిబ్బందిపై కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో అసద్ అహ్మద్ తుపాకీతో కనిపించాడు.దీంతో ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు అసద్ అహ్మదేనని, దీంతో అతనిపై నిఘా పెట్టారు. గత రెండు నెలలుగా ఆయన కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.
>> పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ హత్య తరువాత అసద్ లక్నోకు పారిపోయాడు. పట్టపగలు ఉమేష్ పాల్ హత్య జరగడంతో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో యోగి ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల దాడి చేశాయి. పలు ప్రశ్నలను లేవనెత్తాయి. దీంతో ఈ ఘటనలో పాల్గొన్న వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అసద్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పలు రహస్య స్థావరాల్లో దాకున్నారు.
>> ఈ క్రమంలో తొలుత అసద్ లక్నో నుంచి కాన్పూర్‌కు పారిపోయాడు. అక్కడి నుంచి మీరట్ వెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ సంగమ్ విహార్ ప్రాంతంలో ఉన్నారు. ఆ తర్వాత అజ్మీర్.. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ .. ఇలా తరుచు తన లొకేషన్లు మారుస్తూ .. పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో అసద్ 10 సిమ్ కార్డులను కూడా మార్చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
>> అతిక్ అహ్మద్ గ్యాంగ్‌లో అసద్ కి ఒక ఇన్‌ఫార్మర్ ఉన్నాడని, అతను అసద్ రహస్య స్థావరాల గురించి అతనికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసు వర్గాలు తెలిపాయి. అసద్ ఝాన్సీకి చేరుకోగానే అతడిని పట్టుకునేందుకు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు ప్రారంభించారు. హత్య కేసులో సహ నిందితులుగా ఉన్న అసద్, గులాం గురువారం బైక్‌పై మధ్యప్రదేశ్‌కు బయలుదేరారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వేషం మార్చుకున్నారు.
>> కానీ, అసద్‌పై నిఘా ఉంచిన యుపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం మధ్యప్రదేశ్‌కు వెళుతుండగా వారిద్దరినీ అడ్డగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 మంది సభ్యులతో కూడిన పోలీసు బృందంపై గులాం కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అసద్, గులాం కాల్చి చంపబడ్డారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా దాదాపు 42 రౌండ్ల కాల్పలు జరిగినట్టు తెలిపారు.
