గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష.. ఏ కేసులో అంటే ?

కపిల్ దేవ్ సింగ్ అనే వ్యక్తి హత్య, 2010లో మీర్ హసన్ హత్యాయత్నం కేసులో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.5 లక్షల జరిమానా విధించింది. 

Gangster Mukhtar Ansari was sentenced to ten years in prison.. in which case?..ISR

గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. కపిల్ దేవ్ సింగ్ అనే వ్యక్తి హత్య, 2010లో మీర్ హసన్ హత్యాయత్నం కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2010లో నమోదైన గ్యాంగ్ స్టర్ చట్టం కింద అన్సారీని దోషిగా తేల్చిన ఉత్తరప్రదేశ్ కోర్టు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. గత 13 నెలల్లో అన్సారీపై నమోదైన ఆరు వేర్వేరు కేసుల్లో అన్సారీని దోషిగా తేల్చారు.

వీధి కుక్కల కంటే ఈడీనే ఎక్కువగా తిరుగుతోంది - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఘాటు వ్యాఖ్యలు

‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. కపిల్ దేవ్ సింగ్, మీర్ హసన్ కేసుల్లో ముక్తార్ అన్సారీపై గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు నమోదైంది. అన్సారీని వారణాసి ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జూన్ 5న దోషిగా నిర్ధారించిందని యూపీ పోలీస్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. కాగా.. యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సోదరుడు అవదేశ్ రాయ్ హత్య కేసులో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

రెండు వారాల క్రితం ముక్తార్ అన్సారీపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రూ.73.43 లక్షలకు పైగా విలువైన భూములు, భవనం, బ్యాంకు డిపాజిట్లను జప్తు చేసింది. ఈ ఆస్తుల మొత్తం రిజిస్టర్డ్ విలువ రూ.73,43,900గా ఉంది. గ్యాంగ్ స్టర్ చట్టం కింద అన్సారీ, అతని ముఠా సభ్యులకు చెందిన రూ.300 కోట్ల విలువైన ఆస్తులను రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు జప్తు చేశారని, రూ.284.77 లక్షల విలువైన ఆస్తులను కూల్చివేశామని, అన్సారీ, అతడి అనుచరుల నుంచి అక్రమాస్తులను విడిపించామని ప్రశాంత్ కుమార్ తెలిపారు.

డ్యూటీలో ఉన్న పోలీసునే ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరి కింద పడి, తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్.. వీడియో వైరల్

కాగా.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ, రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని బండా జైలులో ఉన్నారు. 2021లో అన్సారీపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆయన జైలులో ఉన్న సమయంలోనే అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఇదిలా ఉండగా అతడి కుమారుడు అబ్బాస్ అన్సారీని కూడా గతేడాది నవంబర్‌లో ఈడీ ప్రయాగ్‌రాజ్‌లోని సబ్ జోనల్ కార్యాలయంలో ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. దీని తర్వాత ముఖ్తార్ అన్సారీ బావ అతిఫ్ రజా కూడా అరెస్ట్ అయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios