డ్యూటీలో ఉన్న పోలీసునే ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరి కింద పడి, తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్.. వీడియో వైరల్

విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ ను ఓ ఎస్ యూవీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

A policeman on duty was hit by a car.. The constable fell down and got seriously injured.. The video went viral..ISR

ఢిల్లీలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ కారు వేగంగా వచ్చి డ్యూటీలో ఉన్న పోలీసులను ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దారుణం.. ఎనిమిదేళ్ల విద్యార్థినిపై యాసిడ్ పోసిన గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం.. అసలేం జరిగిందంటే ?

వివరాలు ఇలా ఉన్నాయి.. అది ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతం. అక్టోబర్ 24వ తేదీ. అర్ధరాత్రి ఒంటిగంట సమయం. ఢిల్లీ పోలీసు డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రవిసింగ్ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. తన విధుల్లో భాగంగా బారికేడ్ల పక్కన పలు వాహనాలు ఆపుతూ.. వాటిని తనిఖీ చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఓ బ్లాక్ స్కార్పియో ఎస్ యూవీ ఆయన నిలబడ్డ బారికేడ్ల వైపు వేగంగా దూసుకొని వచ్చింది. ఆకస్మాత్తుగా కానిస్టేబుల్ రవిసింగ్ ను, పక్కన నిలబడి ఉన్న కారును, బారికేడ్లను ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుల్ గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. అలాగే కారు కూడా పక్కకి జరిగిపోయింది.

దీంతో అక్కడే ఉన్న మరో పోలీసు ఎస్ యూవీని వెంబడించి పట్టుకున్నారు. అలాగే గాయపడిన కానిస్టేబుల్ ను రవిసింగ్ గా వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశారు. అయితే ఎస్ యూవీ నడిపిన డ్రైవర్ ను రామ్ లఖన్ మిశ్రా (52)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని తగిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?

అయితే కారు కానిస్టేబుల్ ను ఢీకొట్టడం, ఆయన గాల్లోకి ఎగిరి పడటం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా.. పోలీసు సిబ్బంది ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ఢిల్లీలో ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios