విద్యార్థులకు చదువుకోవడం ముఖ్యమా ? హిజాబ్ ధరించడం ముఖ్యమా అని కర్నాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే సంజీవ మాతండూరు ప్రశ్నించారు. మతపరమైన ఆచారాలను చదువుకునే దగ్గర పాటించాల్సిన అవసరం లేదని అన్నారు.
హిజాబ్, బురఖా ధరించి కళాశాలకు వెళ్లవద్దని కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే విద్యార్థులను హెచ్చరించారు. చదువుకోవడం ముఖ్యమా లేదా మతపరమైన అభ్యాసాన్ని అనుసరించడం ముఖ్యమా అని విద్యార్థులు నిర్ణయించుకోవాలని సూచించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించే విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని పుత్తూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజీవ మాతండూరు తెలిపారు.
హిజాబ్ పేరుతో మతతత్వ సంస్థలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని సంజీవ మాతండూరు ఆరోపించారు. ‘‘ హైకోర్టు స్పెషల్ బెంచ్ తీర్పును, కాలేజీ డెవలప్ మెంట్ కమిటీని ఉల్లంఘించే విద్యార్థులపై చర్యలు తీసుకుంటాం. హిజాబ్ కోసం పట్టుబట్టిన 24 మంది విద్యార్థులను మంగళవారం సస్పెండ్ అయ్యారు. వారు నిరసనను కొనసాగిస్తే, వారిపై అదే చర్య తీసుకోబడుతుంది. బాలికలు తమ ప్రాధాన్యతను నిర్ణయించుకోవాలి, నేర్చుకోవడం ముఖ్యమా లేదా మతపరమైన అభ్యాసాన్ని అనుసరించడం ముఖ్యమా ’’ అని ఆయన అన్నారు.
ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మారుస్తా.. తండ్రి మాటను నెరవేరుస్తా - ఉద్ధవ్ ఠాక్రే
విద్యార్థులు మతపరమైన ఆచారాలను అనుసరించాలనుకుంటే వారు కళాశాల నుండి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సంజీవ మాతండూరు అన్నారు. మతాన్ని ఆచరించడానికి అవకాశం ఉన్న చోట వారు విద్యను పొందవచ్చని ఆయన చెప్పారు. ‘‘ విద్యార్థుల బాధ్యతారాహిత్య ప్రవర్తనను మేము సహించము. ప్రభుత్వ కళాశాల అనేది ఒక విద్యా సంస్థ, ఇక్కడ అన్ని మతాలకు చెందిన విద్యార్థులకు విద్యను అందిస్తారు. హైకోర్టు ఉత్తర్వులను కఠినంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం ’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని ఉప్పినంగడి డిగ్రీ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు హిజాబ్ ధరించాలని పట్టుబట్టడంతో మంగళవారం తరగతులకు హాజరుకాలేదు. అయితే తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ ముస్లిం విద్యార్థుల బృందం దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మార్చి 15న తోసిపుచ్చింది. కోర్టు ఆదేశాలను అనుసరించి, ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2022-23 విద్యా సంవత్సరం నుండి ప్రీ-యూనివర్శిటీ (పియు) విద్యార్థులకు కళాశాల అభివృద్ధి కమిటీ సూచించిన యూనిఫాంలను తప్పనిసరి చేసింది.
మాస్కు ధరించకుంటే ఫ్లైట్ నుంచి దింపేయడమే.. ఎయిర్‌పోర్టులోనూ పటిష్ట నిఘా
కాలేజీ డెవలప్ మెంట్ కమిటీ లేదా మేనేజ్ మెంట్ ద్వారా ఎలాంటి యూనిఫాం సిఫారసు చేయకపోతే విద్యార్థులు సమానత్వం, ఐక్యతను కాపాడుతూ ఎవరికీ ఇబ్బంది కలిగించిన దుస్తులను ధరించాలని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ వివాదం చెలరేగడంతో ఉడిపిలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీల్లో చదువుతున్న ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కును కల్పించాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును పలు విడతల్లో కోర్టు విచారించింది. చివరికి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టు మార్చి 16న కొట్టివేసింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేస్తూ తీర్పును వెలువరించింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఖచ్చితమైన మతపరమైన ఆచారం కాదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందని హైకోర్టు పూర్తి స్థాయి ధర్మాసనం పేర్కొంది. యూనిఫాంలు ధరించాలని, హిజాబ్ ధరించడాన్ని పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5న జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు సమర్థించింది.
