Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే పంజాబ్ లో గ్యాంగ్‌స్టర్ సంస్కృతి అంతం- - గోల్డీ బ్రార్ నిర్బంధంపై సీఎం భగవంత్ మాన్..

పంజాబ్ రాష్ట్రంలో త్వరలోనే గ్యాంగ్ స్టర్ సంస్కృతి అంతం అవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు, సింగర్ సిద్దూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిని అమెరికాలో అరెస్టు చేశారని ప్రకటించారు. 

Gangster culture will soon end in Punjab - CM Bhagwantman on arrest of Goldie Brar..
Author
First Published Dec 2, 2022, 3:22 PM IST

గాయకుడు, రాజకీయవేత్త సిద్ధూ మూసేవాలా హత్యలో ప్రధాన సూత్రధారి అయిన గోల్డీ బ్రార్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం ధృవీకరించారు. ‘‘ఈ రోజు ఉదయం కెనడాకు చెందిన పెద్ద గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకున్నారని రాష్ట్ర అధినేతగా నేను మీకు చెప్తున్నాను’’ అని గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.

1994 నాటి ఇస్రో గూఢచార్యం కేసు.. సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

‘‘పంజాబ్‌లో ఈ గ్యాంగ్‌స్టర్ సంస్కృతి త్వరలో ముగుస్తుంది. వారు (దేశం) వెలుపల కూర్చున్నారు. అందుకే మేము ఛానెల్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల మేము హోం మంత్రిత్వ శాఖ ద్వారా గోలీ బ్రార్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశాం. అతడిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో భారత్‌కు పంపిస్తామని అక్కడి అధికారులు తెలిపారు. అతడు అనేక పెద్ద హత్యల వెనక ఉన్నాడు. చట్ట ప్రకారం అతడికి కఠినమైన శిక్ష విధిస్తాం ’’ అని ఆయన అన్నారు.

ప్రముఖ ఒడియా సినీ నటి ఝరానా దాస్ కన్నుమూత.. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి

జూన్‌లో పంజాబ్ పోలీసులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ద్వారా ఇంటర్‌పోల్‌కు పంపిన అభ్యర్థన వల్ల లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఇలా వారెంట్ జారీ చేయడం వల్ల 194 సభ్య దేశాలు తమ భూభాగాల్లో ఉన్న ఇతర దేశాలకు చెందిన నిందితులను కనుగొని అరెస్టు చేయడానికి అనుమతి లభిస్తుంది.

మేలో సిద్దూ మూసే వాలా హత్యకు బాధ్యత వహించిన సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిర్బంధం విషయంలో భారతీయ ఏజెన్సీలు ఇంకా నిర్ధారించలేదు. ఈ విషయంలో వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ‘హిందుస్తాన్ టైమ్స్’ నివేదించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), అధికారిక ఛానెల్‌ల ద్వారా యూఎస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతామని, మరిన్ని వివరాలను సేకరించేందుకు అలాగే బ్రార్‌ను నేరుగా భారత్‌కు తీసుకురావడం సాధ్యమయ్యే విషయాలేనా అని చూస్తామని ఓ అధికారి ఆ వార్తా సంస్థతో తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios