విద్యాబుద్దులు చెప్పేవాడే బుద్దితప్పాడు.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు..కీచక టీచర్ ను చితకబాదిన స్థానికులు
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినులను వేధించాడని ఆరోపిస్తూ స్థానికులు అతడిపై దాడి చేశారు. ఆపై ముఖంపై నలుపు రంగు రుద్దారు. ఈ సంఘటన శనివారం శ్రీ గంగానగర్‌లోని గజ్‌సింగ్‌పూర్ ప్రాంతంలో జరిగింది.దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితక్కువ పని చేసాడు. చదువు చెప్పే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సివాడు కామంతో కళ్లుమూసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు. ఇలా విద్యార్థినిపై ఓ కీచక ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులకు దిగిన ఘటన రాజస్థాన్‌లోని గంగానగర్‌లో వెలుగులోకి వచ్చింది. మైనర్ విద్యార్థిని లైంగికంగా వేధించినందుకు ఉపాధ్యాయుడ్ని ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు తగిన గుణపాఠం చెప్పారు. ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసి.. గ్రామం నడిబొడ్డున కూర్చొబెట్టి.. ముఖానికి నల్లరంగు పూశారు. ఈ ఘటన తర్వాత విద్యార్థి కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడైన ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు కూడా చేశారు.
వివరాల్లోకెళ్తే.. 16 ఏళ్ల బాధిత బాలిక గంగానగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదోవ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆ మైనర్ విద్యార్థిని కన్నేశాడు. ఆ చిన్నారిని కీచక ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. ఉపాధ్యాయురాలి నీచమైన చర్యలకు ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.. గ్రామస్తులతో కలిసి పాఠశాలకు వెళ్లి చితక్కబాదారు. ఆ తర్వాత కామాంధుడిపై నలుపు రంగు పోశారు.
కీచక ఉపాధ్యాయుడిపై దాడి చేసి నలుపు రంగు పూసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని కుటుంబీకులు నిందితుడైన ఉపాధ్యాయుడు రాజేష్‌పై కేసు పెట్టగా, అతడ్ని కొట్టినందుకు బాధితురాలి కుటుంబంపై టీచర్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
16 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని నిందితుడైన ఉపాధ్యాయుడిని కొట్టారని దర్యాప్తు అధికారి, కరణ్‌పూర్ అధికారి సుధా పలావత్ తెలిపారు. పోలీసుల ప్రకారం..వారు ఉపాధ్యాయుని దాడి చేసి.. తల, ముఖంపై నలుపు రంగుపూశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై శనివారం కేసు నమోదు చేయగా.. ఉపాధ్యాయుడు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు విచారణ అధికారి తెలిపారు. ఆయన మాట్లాడుతూ, 'ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.
బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కీచక టీచర్‌పై వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారని ఎస్‌హెచ్‌ఓ సుభాష్ బిష్ణోయ్ తెలిపారు. ఆ ఉపాధ్యాయుడిపై గతంలోనూ ఆరోపణలున్నాయని గ్రామస్థులు తెలిపారు. అలాగే.. ఈ ఘటనపై విద్యాశాఖ కూడ స్పందించి.. విచారణలో ఉపాధ్యాయుడు దోషిగా తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.