వివాహితపై పోలీసుల సామూహిక అత్యాచారం.. మరో వ్యక్తికి అమ్మేసి.. దారుణం...
ఓ మహిళను మూడు రోజుల పాటు ఓ ఇంట్లో బందీగా ఉంచి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన హర్యానాలో వెలుగు చూసింది. భర్త మీద ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు దారుణానికి పాల్పడ్డారు.
హర్యానా : హర్యానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ భర్త మీద ఫిర్యాదు చేయడానికి పోలీసులను ఆశ్రయిస్తే.. వారే ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తరువాత వేరే వ్యక్తికి అమ్మేశారు. ఈ షాకింగ్ ఘటన పాల్వాల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెడితే...
ఓ మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు పాల్వాల్‌లోని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. వివాహితపై అక్కడి సబ్-ఇన్‌స్పెక్టర్ సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అధికారులు సోమవారం తెలిపారు.
సాహసి : 350 మందిని కాపాడుతూ తన ప్రాణాలు వదిలి.. ఎవరీ నీర్జా బానోత్ , 37 ఏళ్ల క్రితం ఏం జరిగింది..?
నిందితులు ఆమెను ఓ ఇంట్లో మూడు రోజుల పాటు బందీగా ఉంచి పలుమార్లు అత్యాచారం చేశారు. తరువాత, వారు ఆ మహిళను మరొక వ్యక్తికి విక్రయించారని, అతను కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వారు తెలిపారు.
ఆదివారం సబ్ ఇన్‌స్పెక్టర్ సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.నిందితులలో ఒకరి ఫోన్ నుంచి ఎలాగో మహిళ పోలీసులకు సమాచారం అందించగా, రక్షించినట్లు వారు తెలిపారు.పోలీసులు మహిళను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ జూలై 23న హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది, అక్కడ నిందితుడు సబ్-ఇన్‌స్పెక్టర్ శివ చరణ్‌ను కలిసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించడానికి అతను నిరాకరించాడు. అంతేకాదు.. తన అనుచరుడు బల్లితో కలిసి సమీపంలోని పొలానికి వెళ్లాలని శివ చరణ్ ఆమెను బలవంతం చేశాడు.
అక్కడ నిరంజన్, భీముడు ఉన్నారు. ఆమె అక్కడికివెళ్లిన తరువాత ముగ్గురూ ఆమెపై అత్యాచారం చేయడంతోపాటు అసభ్యకర వీడియోలు కూడా చిత్రీకరించారు. “వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి, ముగ్గురు ఆమెను పల్వాల్‌లోని శాంతి అనే మహిళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ రాత్రి ఆమెను ఉంచి మళ్లీ అత్యాచారం చేశారు” అని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
తరువాత ఆమెను బిజేంద్ర అనే ఒకరికి విక్రయించారు, అతను తన బావ గజేంద్రతో కలిసి సబ్-ఇన్‌స్పెక్టర్ శివ చరణ్ సమక్షంలో ఆమెపై అత్యాచారం చేశాడు అని పోలీసులు తెలిపారు.