దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తమ బండారం బయటపడకుండా ఆమెను గుడిలోకి లాక్కెళ్లి సజీవ దహనం చేశారు.

దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తమ బండారం బయటపడకుండా ఆమెను గుడిలోకి లాక్కెళ్లి సజీవ దహనం చేశారు. ఘజియాబాద్ జిల్లా రాజ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ అమానుష ఘటన జరిగింది. 35 ఏళ్ల వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా.. నిన్న తెల్లవారుజామున ఐదుగురు దుండగులు ఆమె ఇంటిలోకి ప్రవేశించి.. అత్యాచారానికి పాల్పడ్డారు.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు..

ఈ ఘోరాన్ని ఘజియాబాద్‌లో ఉన్న తన భర్తకు ఫోన్ చేసింది.. అతని ఫోన్ కలవకపోవడంతో తన సోదరుడికి ఫోన్ చేసింది.. అతని ఫోన్ నుంచి కూడా స్పందన లేకపోవడంతో.. చివరికి తన కజిన్‌కు ఫోన్ చేసి దారుణాన్ని వివరించింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు.. మరోసారి ఆమె ఇంటికి వచ్చిన దుండగులు.. ఆ వివాహితను సమీపంలోని ఆలయంలోకి ఈడ్చుకెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు.

మరోవైపు ఘటనకు ముందు ఆమె 100 నంబర్‌కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని మృతురాలి భర్త తెలిపాడు. ఆలస్యంగా రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలం నుంచి కొన్ని ఆధారాలు సేకరించారు.. బాధితురాలు చివరిసారిగా మాట్లాడిన ఫోన్ కాల్ నుంచి.. తనపై అత్యాచారానికి పాల్పడిన వారి పేర్లు చెప్పిందని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.