Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడిని గాంధీ కుటుంబం కంట్రోల్ చేయ‌దు - రాహుల్ గాంధీ

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని గాంధీ కుటుంబ కంట్రోల్ చేయబోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం పోటీలో ఉన్న ఇద్దరు మంచి నాయకులు అని, అనేక అంశాల పట్ల అవగాహన ఉందని తెలిపారు. 

Gandhi Family Will Not Control New Congress President - Rahul Gandhi
Author
First Published Oct 8, 2022, 4:23 PM IST

కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిని గాంధీ కుటుంబం రిమోట్‌తో కంట్రోల్ చేస్తుంద‌ని వ‌స్తున్న వాద‌న‌ల‌ను ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లిద్దరూ బలమైన వారని, మంచి వ‌క్త‌లు అని, అనేక అంశాల‌పై అవ‌గాహ‌న ఉన్న నాయ‌కులు అని అన్నారు. భార‌త్ జోడో యాత్ర‌లో తాను ఒంటరిగా లేనని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలతో విసిగిపోయిన లక్షలాది మంది ప్రజలు పాల్గొంటున్నారని అన్నారు. 

పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతుంది. ఈ యాత్ర సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశం ఆయ‌న మ‌ట్లాడారు. తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడిని గాంధీ కుటుంబం రిమోట్‌గా కంట్రోల్ చేస్తుంద‌ని బీజేపీ ఇటీవ‌ల ఆరోపించింది. ఈ విష‌యంలో మీడియా రాహుల్ గాంధీని ప్ర‌శ్నించింది. దీనికి ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. ‘‘ (ఎన్నికలలో) పోటీ చేస్తున్న ఇద్దరికీ ఒక హోదా, దృష్టి ఉంది. వారు బలమైన, బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు. వాళ్లలోని ఏ ఒక్క‌ నాయ‌కుడూ రిమోట్ కంట్రోల్ అవుతార‌ని నేను అనుకోవ‌డం లేదు. నిజం చెప్పాలంటే ఈ మాట‌లు వారిద్ద‌రినీ కించపరిచేలా ఉన్నాయి.’’  అని రాహుల్ గాంధీ అన్నారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో హింస, అరాచకాన్ని సృష్టించింది ఆ పార్టే..

తాను స్వతహాగా ‘తపస్య’ను నమ్ముతానని, భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను చేరుకుంటూ వారి బాధ‌ల‌ను పంచుకోవాల‌ని కోరుకుంటున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. ద్వేషం, హింసను వ్యాప్తి చేయడం దేశ వ్యతిరేక చర్య అని, వారితో తాము పోరాడుతామ‌ని అన్నారు. 

మన చరిత్ర, సంప్రదాయాలను వక్రీకరిస్తున్నందున కొత్త విద్యా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. తాము వికేంద్రీకృత విద్యా వ్యవస్థను కోరుకుంటున్నామం అని తెలిపారు. 'భారత్ జోడో యాత్ర' 2024 ఎన్నికల కోసం కాదని, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ దేశ విభజనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. భారత్ జోడో యాత్ర 2024 ఎన్నికల కోసం కాదని, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న దేశ విభజనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోందని రాహుల్ గాంధీ అన్నారు.

అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం 50 శాతం పూర్త‌య్యింది - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఇదిలా ఉండ‌గా.. రిమోట్ కంట్రోల్ వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ అధ్య‌క్షుడిగా పోటీ చేస్తున్న మల్లికార్జున్ ఖర్గే కూడా నేడు స్పందించారు. కాంగ్రెస్ శ్రేణుల మ‌ద్ద‌తు కోసం వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న శ‌నివారం అహ్మ‌దాబాద్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖ‌ర్గే మాట్లాడారు. తాను ఎవ‌రి చేతిలో రిమోట్ కంట్రోల్ కాబోన‌ని, తన చేతిలోనే రిమోట్ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ మాదిరిగా కాంగ్రెస్ లో రిమోట్ కంట్రోల్ ప‌ద్ద‌తి ఉండ‌ద‌ని అన్నారు.

మృత‌శిశువును ప్ర‌స‌వించిన ఏడో త‌ర‌గ‌తి బాలిక‌.. అంతలోనే మ‌రో విషాదం..

బీజేపీలోనే అధ్య‌క్షుడిని ఏకాభిప్రాయం ద్వారా ఎన్నుకుంటార‌ని, కానీ కాంగ్రెస్ లో ఎన్నిక‌లు నిర్వ‌హించి ఎన్నుకుంటార‌ని ఖ‌ర్గే అన్నారు. అధ్యక్షుడిని ఎన్నుకునే సంస్కృతి బీజేపీకి లేదని ఆయన విమర్శించారు. ఆ ప‌ద‌వి కోసం ఎన్నిక‌లు నిర్వ‌హించాడ‌ని ప్ర‌ధాని ఎన్ని సార్లు చొర‌వ తీసుకున్నార‌ని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైతే సంస్థాగత పోస్టుల్లో 50 ఏళ్లలోపు వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలోని ప్రతీ స్థాయిలో మహిళలు, యువత, దళితులు, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు
 

Follow Us:
Download App:
  • android
  • ios