Asianet News TeluguAsianet News Telugu

ఈశాన్య రాష్ట్రాల్లో హింస, అరాచకాన్ని సృష్టించింది ఆ పార్టే.. 

అస్సాం ప‌ర్య‌ట‌న‌లో  ఉన్న‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై  దాడి చేశారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ఈశాన్య ప్రాంతం శాంతి, అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, 9,000 మంది ఆయుధాలు వదులుకుని అస్సాంలో బీజేపీ శాంతిని నెలకొల్పిందని షా అన్నారు.

Congress pushed North east to violence and anarchy: Amit Shah in Assam
Author
First Published Oct 8, 2022, 4:12 PM IST

అస్సాం ప‌ర్య‌ట‌న‌లో  ఉన్న‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై  విమ‌ర్శ‌ల దాడి చేశారు. 
కొన్ని పార్టీలు ఈశాన్య ప్రాంతాలను హింస, అరాచకంలోకి  నెట్టివేశాయ‌ని అన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌ అస్సాంలోని గౌహతిలో  నూత‌నంగా నిర్మించిన అస్సాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా  గౌహతి లో ఏర్పాటు చేసిన‌ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను నేడు అస్సాంకు హోంమంత్రిగా రాలేదని, బీజేపీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు.  కాంగ్రెస్‌పై ఆరోపిస్తూ.. అసోంను కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసింద‌నీ, ఉగ్రవాదం, సమ్మెలు, ఆందోళనల భూమిగా మార్చిందని ఆరోపించారు. అస్సాంలో సమ్మిళిత అభివృద్ధి జరగకపోతే.. ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద సమస్య అవుతుందని ప్రజలు ఎప్పుడూ ఆందోళన చెందుతున్నార‌ని అన్నారు.

అస్సాంను కాంగ్రెస్ టెర్రర్ ల్యాండ్ చేసిందని అమిత్ షా అన్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు హితేశ్వర్ సైకియా ఒకసారి ఏబీవీపీ కార్యక్రమానికి అస్సాం వచ్చినప్పుడు త‌మ‌పై దాడి చేశార‌ని అన్నారు. అసోంలో వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అప్పుడు అనుకోలేదని షా అన్నారు. కాంగ్రెస్ నాయకుడు హితేశ్వర్ సైకియా 1996లో మరణించారు, అతను రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రి అయ్యాడు.

అసోంలోని ప్రధాన సమస్య కాంగ్రెస్ వల్లే వచ్చిందని, పవిత్రమైన, శాంతియుతమైన అస్సాంను విభజించాలని ఎప్పుడూ తహతహలాడుతుందని అన్నారు. తాను విద్యార్థి పరిషత్ లో ఉన్న రోజుల్లో అస్సాంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు, కానీ నేడు రాష్ట్రంలో నిరంతర బీజేపీ పాలన సర్వతోముఖాభివృద్ధికి భరోసానిస్తోంది. 2014 నుండి 2022 వరకు తక్కువ వ్యవధిలో.. ఈశాన్య, అస్సాం అభివృద్ధి పథంలోకి ప్రవేశించినందుకు తాను నేడు  చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. 

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ఈశాన్యంలో బీజేపీ అభివృద్ధి రెండూ కలిసి సాగడం త‌న లాంటి కార్యకర్తకు దక్కిన అదృష్టమని అన్నారు. ఇతర పార్టీలకు ఆఫీసు అంటే ఇటుకలు, రాళ్లతో కట్టిన ఇల్లు కావచ్చు, కానీ  బీజేపీ కార్యకర్తకు ఆఫీసు అంటే భవనం కాదు, ఆఫీసు అంటే భావోద్వేగాల మూట. ఇక్కడే మొత్తం ఈశాన్య, అస్సాం అభివృద్ధికి బిజెపి ప్రణాళికలు రూపొందించిందని అన్నారు. 

అస్సాం టూర్ లో అమిత్ షా
  
వాస్తవానికి.. దీని తర్వాత అమిత్ షా డ్రగ్స్‌కు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్‌లతో సమావేశమ‌య్యారు. ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సదస్సును ప్రారంభించేందుకు ఆయన గోలాఘాట్ జిల్లాలోని దర్గావ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అస్సాంలో అనేక వారాంతపు కార్యక్రమాలకు హాజరు కావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా , భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా శుక్రవారం (అక్టోబర్ 7) సాయంత్రం గౌహతికి చేరుకున్న విష‌యం తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios