న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఓ దేశభక్తుడని బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ చెప్పారు.

తమిళనాడులో ఎంఎన్ఎం చీఫ్, సినీ నటుడు కమల్‌హసన్ నాథూరామ్ గాడ్సేపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.నాథూరామ్ గాడ్సే దేశ భక్తుడంటూ ఆమె స్పష్టం చేశారు. నాథూరామ్‌ గాడ్సేను టెర్రరిస్టుగా చూస్తున్న  పార్టీలకు ప్రజలు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆమె అభిప్రాయపడ్డారు.

మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞాసింగ్  ఏ1 గా ఉన్నారు. ఈ పేలుళ్లలో  ఆరుగురు చనిపోతే 100 మందికి పైగా గాయపడ్డారు. భోపాల్ ఎంపీ స్థానం నుండి ప్రజ్ఞాసింగ్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ప్రజ్ఞాసింగ్ టెర్రరిస్టుల చేతిలో మృతి చెందిన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరే తన శాపం వల్లే మృతి చెందారని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.