సారాంశం

Gaganyaan Mission: భారత అంతరిక్ష యాత్రలో మరో మైలురాయి అయిన 'గగన్ యాన్' కోసం ఇస్రో చేపట్టిన మానవరహిత పరీక్ష నేడు శ్రీహరికోట నుంచి విజ‌య‌వంతంగా ప‌రీక్షించ‌బ‌డింది. వ్యోమగాములు అత్యవసర పరిస్థితుల్లో ఎజెక్ట్ చేయాల్సి వస్తే ఉపయోగించే వాహనం క్రూ ఎస్కేప్ సిస్టమ్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ ఫ్లైట్ అబార్షన్ పరీక్ష నిర్వహించారు. మిషన్ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంద‌ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు.
 

Gaganyaan Mission-Human spaceflight: భారత అంతరిక్ష యాత్రలో మరో మైలురాయి అయిన 'గగన్ యాన్' కోసం ఇస్రో చేపట్టిన మానవరహిత పరీక్ష నేడు శ్రీహరికోట నుంచి విజ‌య‌వంతంగా ప‌రీక్షించ‌బ‌డింది. వ్యోమగాములు అత్యవసర పరిస్థితుల్లో ఎజెక్ట్ చేయాల్సి వస్తే ఉపయోగించే వాహనం క్రూ ఎస్కేప్ సిస్టమ్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ ఫ్లైట్ అబార్షన్ పరీక్ష నిర్వహించారు. మిషన్ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంద‌ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు.

గ‌గ‌న్ యాన్ మిష‌న్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంపై ఇస్రో చీఫ్ ఎస్ సోమ‌నాథ్ స్పందిస్తూ.. మిషన్ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను ప్రదర్శించడమే ఈ మిషన్ ఉద్దేశమ‌ని పేర్కొన్నారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్ ప్రారంభించడానికి ముందు వాహనం ధ్వని వేగం కంటే కొంచెం ఎక్కువగా వెళ్లిందని పేర్కొన్నారు. "లాంచ్ విండోలో ఈ రోజు గగన్ యాన్ మిషన్ టెస్ట్ ఫ్లైట్ లాంచ్ జరగడం సంతోషంగా ఉంది. గ‌గన్ యాన్ కార్యక్రమం కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను ప్రదర్శించడమే ఈ మిషన్ ప్ర‌ధాన‌ ఉద్దేశ్యం. గగన్ యాన్ మిషన్ బృందానికి ఇదొక పెద్ద శిక్షణ. మాడ్యూల్ రికవరీ జరుగుతుంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే మరిన్ని అప్ డేట్ లు అందిస్తామ‌ని" చెప్పారు.

అలాగే, ఇది మునుపెన్నడూ చేయని ప్రయత్నమ‌నీ, ఇది మూడు వేర్వేరు పరీక్షల స‌మూహంగా పేర్కొంటూ.. దాని సామర్థ్యాలను పక్కాగా ప్రదర్శించామ‌ని కూడా ఇస్రో చీఫ్ ఎస్ సోమ‌నాథ్ పేర్కొన్నారు. కాగా, టెస్ట్ వెహికల్ డి1 మిషన్ ఉదయం 8 గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుండి నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా, దానిని 8.45 గంటలకు సవరించారు. అయితే ప్రయోగానికి కేవలం 5 సెకన్ల ముందు కౌంట్డౌన్ ఆగిపోయింది. టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ను గుర్తించిన ఇస్రో వెంట‌నే ప‌రిష్క‌రించి ఉదయం 10 గంటలకు పరీక్షను విజయవంతంగా ముగించింది. మూడు రోజుల పాటు 400 కిలోమీటర్ల లో ఎర్త్ ఆర్బిట్ లో మానవులను అంతరిక్షంలోకి పంపి వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న గగన్ యాన్ కార్యక్రమానికి ఎంతో కీల‌క‌మైన ఘ‌ట్టంగా చెప్ప‌వ‌చ్చు.