గగన్ యాన్ : మళ్లీ మొదలైన కౌంట్ డౌన్.. 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్..
గగన్ యాన్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను ఇస్రో పరిష్కరించింది. చివరి క్షణంలో సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన ఈ ప్రయోగం.. మరి కొన్ని నిమిషాల్లో నింగిలోకి దూసుకెళ్లనుంది.
చివరి క్షణంలో సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన గగన్ యాన్ ప్రయోగం.. మరి కొన్ని నిమిషాల్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. మిషన్ లో తలెత్తిన సమస్యను పరిష్కరించామని, నేటి ఉదయం 10 గంటలకు ప్రయోగానికి అంతా సిద్దం చేశామని ఇస్రో తాజాగా ప్రకటించింది. అంతకు ముందు కూడా అరగంట కౌంట్ డౌన్ పొడిగించి, 5 సెకన్లు ఉందనగా నిలిపివేసింది.
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గగనయాన్ ప్రయోగం వాస్తవానికి శుక్రవారం రాత్రి రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో అరగంట కౌంట్ డౌన్ పొడిగించింది. 8.30 గంటలకు గగన్ యాన్ నింగిలోకి దూసుకెళ్తుందని ప్రకటించింది. కానీ 5 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేసింది.
తాజాగా ఆ సమస్యను పరిష్కరించి కౌంట్ డౌన్ ను 10.00 గంటలకు పొడిగించారు. గగన్ యాన్ కు ముందు ఇస్రో నిర్వహించనున్న నాలుగు పరీక్ష్లోల.. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ మొదటిది. అదే ఇప్పుడు నిర్వహించనున్నారు. ఇంతకుముందు 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ.. అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షించనున్నారు.