G20 Summit : G20 సమ్మిట్ భారతదేశ అధ్యక్షతన వసుధైవ కుటుంబం (ఒకే పుడమి, ఒక కుటుంబం, ఒక భవిత) అనే ఇతివృత్తంతో.. ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను సమిష్టిగా, సమర్ధవంతంగా పరిష్కరించడంలో ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ అధ్యక్షత వహిస్తున్న G20 కాన్ఫరెన్స్ .. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరుగనున్నది.
G20 Summit : వేగంగా మారుతున్న భౌగోళిక , రాజకీయ పరిణామాలు.. వెంటాడుతున్న కరోనా కష్టాలు.. ఆగని రష్యా- ఉక్రెయిన్ యుద్దం, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలు ఇలాంటి పరిణామాల నడుమ భారత్ జీ 20 దేశాల కూటమి పగ్గాలను అందుకుంది. ఈ అవకాశాన్ని భారత్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం సంతోషదాయకమే.. కాక ప్రపంచ నేతగా ఎదుగుతూ.. మన సత్తాను చాటేందుకు సరైన సందర్భం.
G20 సమ్మిట్ లో భాగంగా 20 సభ్య దేశాల ఆహ్వానితులు, వాటి అనుబంధ సంస్థలతో భారత్ లోని ప్రధాన 50 నగరాల్లో దాదాపు 200 సమావేశాలను నిర్వహించబడుతున్నాయి. ఈ సమావేశాలు చాలా ప్రత్యేకం. దేశ రాజధానినగరం, ఇతర ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసినా సమావేశ గదుల్లో సమావేశం కాకుండా.. ప్రపంచ దేశాలకు భారత దేశ సాంస్కృతిక వైవిధ్యం, విభిన్న ప్రాంతాలలో ఆచార వ్యవహారాలను కూడా తెలుసుకునే విధంగా సమావేశాలను ఏర్పాటు చేస్తుంది.
G20 సమ్మిట్ భారతదేశ అధ్యక్షతన వసుధైవ కుటుంబం (ఒకే పుడమి, ఒక కుటుంబం, ఒక భవిత) అనే ఇతివృత్తంతో.. ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను సమిష్టిగా , సమర్ధవంతంగా పరిష్కరించడంలో ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ అధ్యక్షత వహిస్తున్న G20 కాన్ఫరెన్స్ .. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరుగనున్నది. సమ్మిట్ లో భాగంగా అనేక సమావేశాలను నిర్వహించబడుతాయి.
థింక్20 సమ్మిట్
కర్ణాటకలోని మైసూరులో గురువారం (ఆగస్టు 3, 2023) జరిగిన ఓ థింక్20 సమ్మిట్ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జీ 20 సమ్మిట్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలు చర్చల ద్వారా మార్పు కోరుకుంటున్నాయనీ, G20 వేదికగా ఆ మార్పు సాధ్యమవుతోందని, ఈ ప్రక్రియలో భారతదేశం కీలక కాబోతుందని తెలిపారు..
అలాగే.. గ్లోబల్ సమస్యలు, అవి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయనే దానిపై కూడా కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడారు. ప్రపంచ దేశాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయనీ, ఆ సమస్యలు అనేక ఆందోళనలను కలిగిస్తున్నాయని తెలిపారు. ఐరోపాలోని పరిణామాలు కూడా ప్రపంచదేశాలను ప్రభావితం చేస్తున్నాయని, ఆ పరిణామాల ప్రభావాన్ని స్వీకరించి, సర్దుబాటు చేయాలని పేర్కొన్నారు.
4-పాయింట్ ఎజెండా
అందరినీ కలుపుకొని, ప్రతిష్టాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించడమే G20 ఎజెండా అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్ డిసెంబర్ 1, 2022న ఒక సంవత్సర కాలం G20 అధ్యక్ష పదవిని చేపట్టింది. బాలిలో జరిగిన జీ 20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి ప్రధాని మోడీ జీ 20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలు ప్రతిభారతీయుడికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. సభ్యదేశాలను కలుపుకొని, నిర్ణయాత్మకమైన,చర్య కోసం కృషి చేస్తుందని, ప్రపంచ మార్పునకు జీ 20 సదస్సును ఉత్రేరకంగా మారుస్తామని ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
జీ 20 లక్ష్యం
జీ 20 ఆరు అంశాలపై దృష్టి పెట్టింది.
* గ్రీన్ డెవలప్‌మెంట్, క్లైమేట్ ఫైనాన్స్,
* వేగవంతమైన, స్థితిస్థాపక, సమగ్ర వృద్ధి
* స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల వైపు పురోగమించడం.
* సాంకేతిక పరివర్తన, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
* 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు
* మహిళ సాధికారత.
భారతదేశ సాంస్కృతిక వారసత్వం, చరిత్ర, గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు తెలియపరిచేలా..సంవత్సరం పొడవునా.. కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు వివిధ ప్రధాన నగరాల్లో సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు,అతిథులకు దేశంలోని విభిన్న భాషలు, వంటకాలు, సాంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను క్లుప్తంగా పరిచయం చేస్తారు.
నాగాలాండ్ నిర్వహించే హార్న్‌బిల్ ఫెస్టివల్ లాంటి ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలను G20 వేదికపై ప్రదర్శించాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఏడాది జూన్ మధ్యలో G20 డెవలప్‌మెంట్ మంత్రుల సమావేశం కోసం వారణాసిని సందర్శించినప్పుడు.. యూరోపియన్ యూనియన్ కమీషనర్ జుట్టా ఉర్పిలైనెన్ మాట్లాడుతూ.. వారణాని నగరం తనకు ఎంతో ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించిందనీ, G20 ఈవెంట్ భారత్ వేదికపై జరగడం ఈ సదస్సు గౌరవాన్ని మరింత పెంచిందని తెలిపారు.
ఈ సదస్సుకు విచ్చేసే దేశాధినేతలకు వారసత్వ నగరాల్లో ఆతిథ్యం ఇచ్చారు. సుదూర ప్రాంతాలలో నిర్వహించబడే ప్రధాన ఈవెంట్‌లు, చిన్న పరిశ్రమల వృద్ధి మార్గాన్ని క్రమబద్ధీకరించడానికి వివిధ పట్టణాల్లో రక్షణ ప్రదర్శనలు నిర్వహించడం, రాష్ట్రాల అంతటా సైనిక కమాండర్ల సమావేశాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 'సెల్ఫీ ప్రచారాన్ని' ప్రారంభించింది. G20 థీమ్‌లతో స్మారక చిహ్నాల వద్ద సెల్ఫీలు తీసుకోమని ప్రోత్సహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. 100 స్మారక చిహ్నాల జాబితాలో UNESCO వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభంలో పనికిమాలినవిగా కనిపించవచ్చు, కానీ అవి దౌత్య బంధాలను చాలా దూరం వెళ్తాయి.
ఇలాంటి విభిన్న కార్యక్రమంలో ప్రపంచదేశాలకు భారత్ పై ఉన్న భిన్నమైన అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది. నిజమైన భారతదేశం గురించి తెలుసుకున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యాలు కూడా భారత దేశ సామర్ధ్యాన్ని, కీర్తిని అంగీకరించాయి.
