G20 Summit 2023: అతిథులొస్తున్నారు.. ఎవరిని ఎవరు ఆహ్వానించనున్నారంటే..?
G20 Summit 2023: దేశ రాజధాని ఢిల్లీ G20 సమ్మిట్‌కు సిద్దమైంది. సమ్మిట్‌లో పాల్గొనే అతిథుల రాక కూడా ప్రారంభమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 8) అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఢిల్లీ చేరుకోనున్నారు. అయితే.. జో బిడెన్ సహా ప్రపంచ దేశాధినేతలను ఎవరు ఆహ్వానించనున్నారో ఓ సారి చూద్దామా ..

G20 Summit 2023: జీ 20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు నేడు (శుక్రవారం) దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు అగ్రదేశాల నాయకులు హస్తినకు చేరుకోనున్నారు. అయితే.. ఏయే దేశాల నేతలు ఏ సమయానికి ఢిల్లీకి రానున్నారు.. వారిని ఎవరూ రిసీవ్ చేసుకోనున్నారో ఓ సారి చూద్దామా
యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్:
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రాకపైనే అందరి ద్రుష్టి ఉంది. ఆయన శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికె సింగ్ ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతారు.
యూకే ప్రధాని రిషి సునక్:
జీ 20 సదస్సులో పాల్గోని తన గళాన్ని వినిపించనున్న ముఖ్య నేతల్లో రిషి సునక్ ఒకరు. ఆయన
మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ తరుణంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా:
యూకే ప్రధాని రిషి సునక్ విమానం ల్యాండ్ అయిన కాసేపటికే జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా విమానం కూడా పాలెం విమానాశ్రయాంలో ల్యాండ్ కానున్నది. ఆయన మధ్యాహ్నం 2.15 గంటలకు భారతదేశానికి చేరుకుంటారు. ఆయనకు కూడా కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే నే ఆహ్వానించనున్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా:
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటారు. ఆమెకు రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోష్ స్వాగతం పలుకుతారు.
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని:
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని శుక్రవారం ఉదయం 6.20 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఆయనకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరద్లాజే సాదరంగా స్వాగతం పలుకనున్నారు.
చైనా ప్రధాని లీ కియాంగ్:
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బదులు G20 సమ్మిట్‌లో ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ పాల్గొంటారు. ఆయన శుక్రవారం రాత్రి 7.45 గంటలకు దేశ రాజధానికి చేరుకుంటారు. ఆయకు కేంద్ర మంత్రి VK సింగ్ ఆహ్వానించనున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్:
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటారు. ఆయనకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలుకుతారు.
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్:
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఆయనకు స్వాగతం పలుకుతారు.
జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్:
జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ శనివారం ఉదయం 8 గంటలకు చేరుకోనున్నారు. MSME సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ ఆయనను సాదరంగా ఆహ్వానించనున్నారు .
యుఎఇ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్:
యుఎఇ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం రాత్రి 8 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయనకు హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్వాగతం పలుకుతారు.